Elon musk: ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

Read Time:  1 min
ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..
ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..
FONT SIZE
GET APP

టెక్ ప్రపంచంలో ఇప్పుడు అందరి కళ్లు ఎలన్ మస్క్ , ఓపెన్ ఏఐ మధ్య జరుగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటంపైనే ఉన్నాయి. ఈ క్రేజీ లీగల్ బ్యాటిల్‌లో తాజాగా ఎలన్ మస్క్ (Elon Musk) ఒక కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో తాను గెలిస్తే వచ్చే భారీ మొత్తాన్ని తన సొంతానికి వాడుకోనని, ఆ డబ్బు మొత్తాన్ని చారిటీకి ఇచ్చేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “నా లాభం కోసం నేను ఈ పోరాటం చేయడం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. అసలు ఈ వివాదం ఏమిటి? 2015 లో ఓపెన్ ఏఐ సంస్థను స్థాపించిన వారిలో మస్క్ కూడా ఒకరు. అప్పట్లో ఈ సంస్థను లాభాపేక్ష లేని సంస్థగా, మానవాళి ప్రయోజనం కోసం ఏఐని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రారంభించారు. అయితే 2018లో మస్క్ ఈ సంస్థ నుంచి తప్పుకున్నాక, ఓపెన్ ఏఐ తన రూటు మార్చుకుంది. లాభాల కోసం పని చేసే సంస్థగా మారడమే కాకుండా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు మస్క్‌ కు నచ్చలేదు. సంస్థ తన ప్రాథమిక లక్ష్యం నుంచి పక్కకు జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు.

Read Also: LPG Shortage: భయాందోళనలతో బుకింగ్‌లు చేయవద్దు: వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్ విజ్ఞప్తి

Elon Musk: Elon Musk VS Sam Altman..
Elon Musk: Elon Musk VS Sam Altman..

ఓపెన్ ఏఐ వాదన ఏంటి?

ఈ కేసులో మస్క్ దాదాపు 79 బిలియన్ డాలర్ల నుంచి 134 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం కోరుతున్నారు. ఓపెన్ ఏఐ అక్రమ మార్గాల్లో లాభాలు పొందిందని ఆయన తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఒకవేళ కోర్టు మస్క్‌ కు అనుకూలంగా తీర్పునిచ్చి, ఈ భారీ మొత్తం ఆయనకు దక్కితే.. దానిని పూర్తిగా దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తానని ఆయన ‘X’ వేదికగా వెల్లడించారు. “నేను ఏ విధంగానూ నన్ను నేను ధనవంతుడిని చేసుకోవాలని అనుకోవడం లేదు” అని ఎలన్ మస్క్ (Elon Musk) తన పోస్ట్‌లో రాశారు మస్క్ ఆరోపణలను ఓపెన్ ఏఐ తీవ్రంగా ఖండిస్తోంది. సంస్థను లాభాపేక్ష కలిగిన స్ట్రక్చర్‌ కు మార్చాలనే చర్చలు జరుగుతున్నప్పుడు మస్క్‌ కు అంతా తెలుసని, ఆయన కూడా ఒకప్పుడు దానికి మద్దతు ఇచ్చారని ఓపెన్ ఏఐ ప్రతినిధులు చెబుతున్నారు. సంస్థపై పెత్తనం కోసం మస్క్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఆయన బయటకు వచ్చారని, ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు వాదిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.