అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ (Elon Musk) మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆయన లక్ష్యం యూరప్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ రైయానైర్ (Ryanair). తన సోషల్ మీడియా వేదిక Xలో మస్క్.. రైయానైర్‌ను కొనుగోలు చేయాలా? అనే అంశంపై అనుచరులతో పోల్ నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ పోల్‌లో 9 లక్షల మందికి పైగా పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంపై రైయానైర్ యాజమాన్యం లేదా సంస్థ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ వ్యవహారానికి నేపథ్యం స్టార్‌లింక్ (Starlink) సేవలపై ఏర్పడిన ఘర్షణగా చెప్పవచ్చు. స్పేస్‌ఎక్స్ ద్వారా అభివృద్ధి చేసిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సిస్టమ్‌ను విమానాల్లో వైఫై సేవల కోసం వినియోగించడంపై రైయానైర్ సీఈఓ మైఖేల్ ఓ లియరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: India-EU: భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం
సీఈఓ పదవి నుంచి రైయానైర్ తొలగించాలి: మస్క్
ఒక ఐరిష్ రేడియో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, స్టార్‌లింక్ వ్యవస్థను విమానాల్లో అమర్చడం వల్ల అదనపు యాంటెన్నాల కారణంగా డ్రాగ్ పెరిగి.. ఇంధన వినియోగం అధికమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీని వల్ల కంపెనీకి సంవత్సరానికి సుమారు 250 మిలియన్ డాలర్ల వరకు అదనపు ఖర్చు అవుతుందని ఆయన అంచనా వేశారు. అంతేకాకుండా..రైయానైర్ ప్రయాణికులు విమానంలో ఇంటర్నెట్ సేవ కోసం డబ్బు చెల్లించడానికి ఆసక్తి చూపరని కూడా లియరీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలోన్ మస్క్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ప్రతిస్పందనగా మస్క్.. లియరీని బహిరంగంగానే నిజమైన మూర్ఖుడుగా అభివర్ణించారు. అంతేకాదు, రైయానైర్ సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ కూడా పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: