ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రకటన చేశారు. టెస్లాతో కార్ల పరిశ్రమను, స్పేస్‌ఎక్స్‌తో రాకెట్ రంగాన్ని ఊపేసిన మస్క్, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) కోసం అంతరిక్షంలోనే డేటా సెంటర్లను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఏకంగా 10 లక్షల శాటిలైట్లను కక్ష్యలోకి పంపేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం స్పేస్‌ఎక్స్ (SpaceX) ను తన ఏఐ కంపెనీతో విలీనం చేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతరిక్షంలోనే ఎందుకు? ప్రస్తుతం భూమిపై ఉన్న ఏఐ డేటా సెంటర్లు భారీగా విద్యుత్తును వాడుకుంటున్నాయి. వీటిని చల్లబరచడానికి లక్షల లీటర్ల నీరు అవసరమవుతోంది. ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే మస్క్ “అంతరిక్షంలో ఎప్పుడూ ఎండ ఉంటుంది” అని చెబుతూ.. సోలార్ పవర్ ద్వారా నడిచే స్పేస్ డేటా సెంటర్లను ప్రతిపాదించారు. దీనివల్ల భూమిపై విద్యుత్ గ్రిడ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. ! ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఇవే! అయితే మస్క్ ఆలోచన బాగున్నా ఇందులో అనేక సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.. వేడి సమస్య: అంతరిక్షం చల్లగా ఉన్నప్పటికీ.. అక్కడ గాలి ఉండదు.
Read Also: Central Govt: హోలీకి ముందే ఉద్యోగులకు శుభవార్త
ఒక్క చిన్న ప్రమాదం జరిగినా భారీ విధ్వంసం
గాలి లేకపోతే కంప్యూటర్ చిప్స్ విడుదల చేసే వేడి బయటకు వెళ్లదు. దీనివల్ల ఏఐ చిప్స్ కరిగిపోయే ప్రమాదం ఉంది. దీనికోసం భారీ రేడియేటర్ ప్యానెల్స్ నిర్మించాల్సి ఉంటుంది. స్పేస్ జంక్ (అంతరిక్ష వ్యర్థాలు): ఇప్పటికే స్టార్‌లింక్ ద్వారా 10 వేల శాటిలైట్లు ఉన్నాయి. ఇప్పుడు 10 లక్షల శాటిలైట్లు పంపితే.. వాటి మధ్య ఢీకొనే ప్రమాదం పెరుగుతుంది. ఒక్క చిన్న ప్రమాదం జరిగినా భారీ విధ్వంసం జరుగుతుందని నాసా మాజీ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిపేర్లు కష్టం: భూమిపై సర్వర్ పాడైతే వెంటనే మార్చవచ్చు. కానీ, అంతరిక్షంలో పాడైన చిప్స్ ను మార్చడానికి మెకానిక్ టీమ్స్ ఉండవు. ఈ రంగంలో గూగుల్, జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. కానీ, ఎలన్ మస్క్ (Elon musk) వద్ద ఉన్న సొంత రాకెట్లు ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. ఇతర కంపెనీలు తమ చిప్స్ అంతరిక్షంలోకి పంపాలంటే మస్క్ రాకెట్లనే వాడుకోవాలి. విదేశీ సంస్థల నుంచి కిలో బరువుకు 20,000 డాలర్లు వసూలు చేస్తున్న మస్క్.. తన సొంత ప్రాజెక్టుకు మాత్రం కేవలం 2,000 డాలర్లకే రాకెట్లను వాడుకోగలరు. మొత్తానికి ఏఐ రంగంలో విప్లవం తీసుకురావాలని మస్క్ గట్టి పట్టుదలతో ఉన్నారు. సాంకేతిక సమస్యలు దాటుకుని ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: