SpaceX Moon Plan : స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు అంగారక గ్రహంపై కాలనీ ఏర్పాటు గురించి మాట్లాడిన మస్క్, ఇప్పుడు ఫోకస్‌ను పూర్తిగా చంద్రుడి వైపు మళ్లించారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇది చారిత్రక మలుపుగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మార్స్‌తో పోలిస్తే చంద్రుడిపై నగరం ఏర్పాటు చేయడం వేగంగా, సులభంగా సాధ్యమవుతుందని మస్క్ వివరించారు. అంగారకుడికి వెళ్లాలంటే గ్రహాల అమరిక కోసం సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తే, చంద్రుడికి మాత్రం తరచుగా ప్రయాణాలు చేయవచ్చని చెప్పారు. ఇదే నిర్ణయం మార్చుకోవడానికి ప్రధాన కారణమని తెలిపారు.
Read Also: Cordon Search ASP Deeksha: నెల్లూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్..35 వాహనాలు సీజ్
ఈ ప్రాజెక్టులో స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేస్తున్న స్టార్‌షిప్ రాకెట్ కీలక పాత్ర పోషించనుంది. తొలుత రాకెట్లనే నివాసాలుగా ఉపయోగించి, ఆ తర్వాత చంద్రుని మట్టితో కట్టడాలు నిర్మించాలని మస్క్ యోచిస్తున్నారు. అక్కడ లభించే మంచును నీటిగా, ఇంధనంగా మార్చే సాంకేతికతను కూడా వినియోగించనున్నారు. ఈ ప్రణాళికను ‘లూనార్ బేస్ ఆల్ఫా’గా అభివర్ణిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా ప్రభుత్వం కూడా చంద్రునిపై మళ్లీ మానవులను పంపేందుకు ఆసక్తి చూపుతోంది. నాసా చేపడుతున్న ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో స్పేస్‌ఎక్స్ కీలక భాగస్వామిగా ఉంది. వాతావరణం లేకపోవడం, రేడియేషన్ ప్రమాదాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, మానవ నాగరికత భవిష్యత్తు కోసం ఇది అవసరమని మస్క్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంపై ఆసక్తి మరింత పెరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: