📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump : ఎలాన్ మస్క్ ప్రభుత్వ కాంట్రాక్టులు, సబ్సిడీలు రద్దు చేస్తానన్న ట్రంప్

Author Icon By Divya Vani M
Updated: June 6, 2025 • 8:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టుల అంశంపై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మస్క్‌ కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలను రద్దు చేస్తే బడ్జెట్‌లో బిలియన్ల డాలర్లు ఆదా చేయవచ్చు, అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆయన స్వయంగా ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు.టెస్లా అధినేతపై ట్రంప్ (Trump) విమర్శలు అక్కడితో ఆగలేదు. ఇంత సులువైన నిర్ణయం బైడెన్ ఎందుకు తీసుకోలేకపోయాడు? అంటూ ప్రశ్నించారు. దీనికి నేపథ్యం – మస్క్ గతంలో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి 250 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు చెప్పడం. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

పిచ్చివాడిలా ప్రవర్తించాడు” అని మస్క్‌పై ఘాటు వ్యాఖ్య

ఎలాన్ మస్క్‌ సహనం కోల్పోయాడు. అతనితో ఉన్న సంబంధాన్ని నేను ముగించాను. నేను ఎలక్ట్రిక్ వాహనాల మాండేట్‌ను రద్దు చేస్తున్నానని ముందే చెప్పాను. అందుకే అతను అసహనంతో మాట్లాడుతున్నాడు’’ అని ట్రంప్ ఆరోపించారు. అయితే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎలాంటి ఆదేశం ఇవ్వలేదన్నది మరో అంశం.

“బిల్ చూసిన వారే లేరు” – మస్క్ ఆవేదన

ట్రంప్ “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్”పై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లు నన్ను టార్గెట్ చేస్తోంది. నన్ను ఏనాడూ ఆ బిల్లు చూడనివ్వలేదు. రాత్రికి రాత్రే ఆమోదించారు. కాంగ్రెస్‌లో కూడా దాన్ని చదవలేదు అని మస్క్ ట్వీట్ చేశారు.ఒకప్పుడు ట్రంప్ సన్నిహితుడిగా ఉన్న మస్క్, ఇప్పుడు విమర్శకుడిగా మారారు. గతంలో వైట్‌హౌస్‌లోని లింకన్ బెడ్‌రూమ్‌లో బస చేసి, ట్రంప్‌కు సలహాలు ఇచ్చిన మస్క్ – తాజాగా ఆ బంధాన్ని ముగించారు. ఓవల్ ఆఫీస్‌లో వీడ్కోలు పలికిన ఘటన, వీరి సంబంధాల్లో మార్పుకు సంకేతంగా మారింది.

Read Also : Kailash Vijayvargiya : మ‌హిళ‌లు పొట్టి దుస్తుల పై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Elon Musk Subsidies Tesla Government Contracts Trump Musk Controversy Trump Truth Social post Trump vs Musk Tweets

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.