ప్రపంచవ్యాప్తంగా సంచలనం నృష్టించిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Epstein) సెక్స్ కుంభకోణంలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో సీల్ చేసిన మూడు మిలియన్ పేజీల ఎప్‌స్టీన్ పత్రాలు ఉన్నత వర్గాలు, కుటుంబాలకు చెందిన చీకటి సంబంధాలను వెలుగులోకి తెచ్చాయి. పేరు ప్రస్తావించిన కొంతమంది వ్యక్తులు తనకు కేవలం తెలుసని చెప్పుకొన్న జెఫ్రీ.. మరికొందర్ని తాను మొదటి నుంచి తిరస్కరించినట్టు పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా ఆయనతో సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ-మెయిళ్లు, ఉత్తరాలు, ట్రావెల్ రికార్డులతో సహా తాజా పత్రాలు 2008లో లైంగిక నేరాలకు పాల్పడినందుకు శిక్ష పడిన తర్వాత కూడా హాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఎప్‌స్టీన్ సన్నిహిత సంబంధాలను కొనసాగించినట్టు బయటపెట్టాయి. ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ , హువార్డ్ లుత్నిక్, రిచర్డ్ బ్రాన్సన్‌ల పేరులో కొత్తగా వెలుగుచూశాయి.
Read Also: WhatsApp: వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!

ఎప్‌స్టీన్, మస్క్ మధ్య నడచిన చాలా మెయిల్స్
ట్రావెల్ లేదా సోషల్ ఈవెంట్ల గురించి ఎప్‌స్టీన్, మస్క్ మధ్య చాలా ఏళ్లు మెయిల్స్ నడిచినట్టు ఈ పత్రాలు చూపుతున్నాయి. ఓ మెయిల్‌లో ఎప్‌స్టీన్ ప్రైవేట్ ద్వీపంలోని ఒక భాగాన్ని కూడా ప్రస్తావించారు. తాను ఆ ద్వీపానికి నేను ఎప్పుడూ వెళ్లలేదని, ఆ ప్రదేశానికి నన్ను తీసుకెళ్లడానికి ప్రయత్నించినా కానీ, నేను నిరాకరించానని సోషల్ మీడియాలో గతేడాది మస్క్ పోస్ట్ చేశారు. కానీ, తాజా పత్రాలు మస్క్ చెప్పేవన్నీ అబద్దాలని స్పష్టం చేశాయి. ఈ పత్రాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మస్క్ స్పందిస్తూ.. తనకు, ఎప్‌స్టీన్‌కు మధ్య జరిగిన మెయిల్స్ గురించి వివరణ ఇచ్చారు. తన వద్ద కొన్ని మెయిల్స్ మాత్రమే ఉన్నాయని, అతడి ప్రయివేట్ ద్వీపానికి వెళ్లడం ‘లోలితా ఎక్స్‌ప్రెస్’ అనే మారుపేరుతో ఉన్న అతడి ప్రైవేట్ విమానంలో ప్రయాణించలేదని పదేపదే ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించే కొందరు.. మెయిళ్లను తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకుని ఉండొచ్చని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: