📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Data center : ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

Author Icon By Sai Kiran
Updated: December 17, 2025 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Elon Musk data center : ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ సంస్థ xAI నిర్మించిన భారీ డేటా సెంటర్ కారణంగా మెమ్ఫిస్ నగరంలోని బాక్స్‌టౌన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డేటా సెంటర్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్యం కారణంగా తమ ఇళ్ల కిటికీలు కూడా తెరవలేని పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాక్స్‌టౌన్‌లో నివసిస్తున్న 76 ఏళ్ల ఈస్టర్ నాక్స్ మాట్లాడుతూ, “ఇది దేవుడు ఇచ్చిన గాలి. మనిషికి దానిని దూరం చేసే హక్కు లేదు. ఎంత డబ్బు ఉన్నా, మా ప్రాణాలతో ఆడుకోకూడదు” అని అన్నారు. ఆమెకు గతేడాది క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) నిర్ధారణ కాగా, క్యాన్సర్ వల్ల ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు తెలిపారు. డేటా సెంటర్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత గ్యాస్ వాసన, కుళ్లిన క్యాబేజీ వాసన లాంటి దుర్వాసన వస్తోందని, అందుకే కిటికీలు తెరవడం మానేశామని చెప్పారు.

Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

బాక్స్‌టౌన్ ప్రాంతంలో అధికంగా ఆఫ్రికన్-అమెరికన్ (Elon Musk data center) జనాభా నివసిస్తుండగా, ఇప్పటికే ఎన్నో పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది. డేటా సెంటర్ ఏర్పాటుతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ మెమ్ఫిస్‌కు చెందిన వైద్యుడు ఆస్టిన్ డాల్గో మాట్లాడుతూ, “ఇలాంటి కేంద్రాలను ధనిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉంటే తీవ్ర నిరసనలు వచ్చేవి. కానీ చారిత్రకంగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలనే ఎంచుకోవడం పర్యావరణ వివక్షకు నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.

ఈ డేటా సెంటర్‌కు విద్యుత్ సరఫరా కోసం గ్యాస్ టర్బైన్‌లను ఉపయోగించారని, మొదట ఇవి తాత్కాలికమని చెప్పినా, అవి నెలల తరబడి కాలుష్య నియంత్రణ అనుమతులు లేకుండానే పనిచేశాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో NAACP సంస్థ xAIపై క్లీన్ ఎయిర్ చట్టం ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని నోటీసు జారీ చేసింది.

అయితే నగర పాలకులు మాత్రం డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు, పన్నుల ఆదాయం పెరుగుతాయని వాదిస్తున్నారు. అయినా స్థానికుల ఆరోగ్య భయాలు తగ్గడం లేదని, “మా ఇంట్లో కూడా ప్రశాంతంగా శ్వాస తీసుకోలేకపోతున్నాం” అని యువతీ అలెక్సిస్ హంప్రే ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI data center environmental impact Boxtown residents complaint Breaking News in Telugu clean air act violation data center health issues Elon Musk data center Elon Musk news environmental racism USA gas turbines pollution Google News in Telugu Latest News in Telugu Memphis air pollution Telugu News xAI pollution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.