El mencho death : డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

Read Time:  1 min
El mencho death
El mencho death
FONT SIZE
GET APP

El mencho death : మెక్సికోలో అత్యంత ప్రభావశీల డ్రగ్ మాఫియా నేతగా పేరుగాంచిన ఎల్ మెంచో (Nem esio Ruben Oseguera Cervantes) సైనిక ఆపరేషన్‌లో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జాలిస్కో రాష్ట్రంలో భద్రతా దళాలు నిర్వహించిన భారీ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఎల్ మెంచో స్థానం గుర్తించేందుకు భద్రతా సంస్థలు అత్యంత వ్యూహాత్మకంగా పనిచేశాయి. అతనికి అత్యంత సన్నిహితురాలైన మహిళ కదలికలను గమనిస్తూ, తపాల్పా కొండ ప్రాంతంలో అతను దాక్కున్నాడని గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా నిఘా సంస్థలు సమాచార సహాయం మాత్రమే అందించాయని, నేరుగా చర్యలు మెక్సికో భద్రతా దళాలే చేపట్టాయని ప్రభుత్వం తెలిపింది.

ఘర్షణలో కాల్పులు – భారీ నష్టం

సైన్యం ఆ ప్రాంతాన్ని ముట్టడించిన వెంటనే ఎల్ మెంచో అనుచరులు కాల్పులకు తెగబడ్డారు. అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ ఘర్షణలో ఎల్ మెంచోతో పాటు అతని ఇద్దరు అంగరక్షకులు మరణించారు.

Read also: Gee Geronimo Snail: గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

 El mencho death
El mencho death

ఈ వార్త వెలువడగానే అతని గ్యాంగ్ సభ్యులు పలు ప్రాంతాల్లో విధ్వంసానికి దిగారు. రహదారులను దిగ్బంధించి వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘర్షణలలో సుమారు 25 మంది సైనికులు, 30 మంది గ్యాంగ్ సభ్యులు మరణించినట్లు సమాచారం.

ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మెక్సికో ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ తెలిపారు. అమెరికాకు మత్తు పదార్థాల సరఫరాలో కీలక పాత్ర పోషించిన ఎల్ మెంచో మరణం మెక్సికో నేర ప్రపంచంలో పెద్ద మార్పులకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.