📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Eiffel Tower : ఈఫిల్ టవర్ మూసివేత..కారణం ఆ వివాదమే !!

Author Icon By Sudheer
Updated: September 8, 2026 • 9:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Eiffel Tower : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్ సందర్శన సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. బీఏపీఎస్ (BAPS) సంస్థకు చెందిన సుమారు 100 మంది సభ్యుల బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించిన సమయంలో, అక్కడి మహిళా సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌లో బీఏపీఎస్ ఆధ్వర్యంలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించే కార్యక్రమం సందర్భంలో ఈ సందర్శన జరిగింది. అయితే, తమ సిబ్బంది పట్ల వివక్ష చూపారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈఫిల్ టవర్ ఉద్యోగులు నిరసనకు దిగడంతో టవర్‌ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

Read Also : రష్యాలో ఘోర విషాదం.. మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి

పారిస్ మేయర్ విచారణకు ఆదేశం: ఉద్యోగుల నిరసనతో ఆందోళన

పర్యాటకుల భద్రత మరియు సేవల నిర్వహణలో భాగమైన మహిళా సిబ్బందిని పక్కన పెట్టడంపై ఈఫిల్ టవర్ స్టాఫ్ యూనియన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటన ఫ్రాన్స్ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పారిస్ మేయర్ తక్షణమే స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది మంది సందర్శించే ఈఫిల్ టవర్ ఇలాంటి వివాదాల కారణంగా మూతపడటం పర్యాటకులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

BAPS Eiffel Tower Visit Eiffel Tower Eiffel Tower Closed Google News in Telugu Latest News in Telugu Paris Eiffel Tower Controversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.