📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Latest Telugu News: New Zealand: ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

Author Icon By Vanipushpa
Updated: December 5, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్‌(New Zealand)లోని ఆక్లాండ్‌ నగరంలో అనూహ్యమైన ఓ దొంగతనం వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయల విలువైన వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన గుడ్డు ఆకారంలో ఉన్న ఒక ప్రత్యేకమైన లాకెట్‌ను ఓ దొంగ మింగేశాడు. దుకాణ యజమాని ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. కానీ ఆ లాకెట్‌ను స్వాధీనం చేసుకోవడానికి మాత్రం తంటాలు పడ్డారు. చివరాఖరికి ఆ పద్ధతిలోనే లాకెట్‌ను చేజిక్కించుకున్నారు. సెంట్రల్ ఆక్లాండ్‌లోని ప్రముఖ జ్యువెలరీ దుకాణం ప్యాట్రిడ్జ్ జ్యువెలర్స్ దుకాణంలో ఈ దొంగతనం జరిగింది. 32 ఏళ్ల వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి, అత్యంత విలువైన ఆభరణాన్ని అపహరించాడు. అయితే దొంగిలించిన తర్వాత దానిని దాచుకునే క్రమంలో అకస్మాత్తుగా ఆ గుడ్డు ఆకారంలో ఉన్న లాకెట్‌ను మింగేసినట్లు దుకాణ యజమాని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగి నిందితుడిని త్వరగా అదుపులోకి తీసుకున్నారు.

Read Also: RBI: వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

New Zealand


లాకెట్‌ విలువ రూ.18 లక్షలు

పోలీసుల విచారణలో ఆ లాకెట్‌ విలువ, ప్రత్యేకత బయటపడింది. ఆభరణాల వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం, ఆ లాకెట్‌లో దాదాపు 60 తెల్ల వజ్రాలు, 15 నీలమణులను పొదిగారు. దాంతో పాటు 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఒక చిన్న ఆక్టోపస్ బొమ్మ కూడా అందులో ఉంది. దీని మొత్తం విలువ 20 వేల అమెరికన్ డాలర్లు ఉంటుందని దుకాణ యజమాని తెలిపారు. అంటే మన కరెన్సీలో రూ.18 లక్షలు ఉంటుందని అంచనా.

సహజ ప్రక్రియ ద్వారా లాకెట్‌ను బయటకు తీశారు

నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత, లోపలికి వెళ్లిన లాకెట్‌ను బయటకు తీయడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో వారు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిందితుడికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. లాకెట్‌ జీర్ణ వ్యవస్థలో ఎక్కడా ఇరుక్కుపోకుండా, ఇబ్బంది లేకుండా ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా, సహజ ప్రక్రియ ద్వారా లాకెట్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu emergency medicine gastroenterology case Google News in Telugu Latest In telugu news non-surgical procedure swallowed object removal Telugu News Today unusual medical cases

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.