జపాన్‌లో(Earthquake) భూకంపాల సన్నాహం కొనసాగుతుంది. ఉత్తర జపాన్ తీర ప్రాంతం ఈరోజు మరోసారి బలమైన భూకంపంతో కుదేలైంది. రిక్టర్ స్కేల్లో ఈ ప్రకంపనల తీవ్రత 6.7గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. తాజా ప్రకంపనల తరువాత జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ (JMA) సునామీ హెచ్చరికలు ప్రకటించింది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో సుమారు ఒక మీటరు ఎత్తున అలలు తాకే ప్రమాదం ఉందని అధికారులు జాగ్రత్తలు సూచించారు. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) కూడా ఈ భూకంప తీవ్రతను 6.7గా గుర్తించింది.
Read also: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ టిడిపి కైవసం
అణు ప్లాంట్లకు ఎటువంటి ప్రమాదం లేదని అధికారుల భరోసా
హోన్షు ద్వీపంలోని ఇవాటే ప్రిఫెక్చర్‌కు చెందిన కుజీ నగరానికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు(Earthquake) వెల్లడించారు. సోమవారం జరిగిన భారీ భూకంపంతో పోలిస్తే ఈసారి ప్రకంపనలు తక్కువ తీవ్రత కలిగినవేనని ఎన్‌హెచ్‌కే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ఈ భూకంపం వల్ల సమీపంలోని అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి హాని జరగలేదని, ఎటువంటి అసాధారణ పరిస్థితులు కనిపించలేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ స్పష్టం చేసింది. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉన్నందున జపాన్ తరచూ భూకంపాలను ఎదుర్కొవడం సహజం. 2011లో సంభవించిన మహా భూకంపం–సునామీ వల్ల ఏర్పడ్డ విపరీత నష్టాన్ని జపాన్ ఇప్పటికీ మరువలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: