📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Earthquake: తుర్కియేలో భారీ భూకంపం- రిక్టర్ స్కేల్​పై 6.1తీవ్రత

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తుర్కియే(Turkey)లోని బలికెసిర్ ప్రావిన్సులో 6.1 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. భూకంపం ధాటికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్తాంబుల్‌లోనూ భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. సిందిర్గి పట్టణంలో భూకంప కేంద్రం ఉందని, ఆ పట్టణంలో 16 భవనాలు నేలమట్టమయ్యానని పేర్కొన్నారు. భవన శిథిలాల కింద చిక్కుకొని ఓ యువతి మృతిచెందిందగా, మరో 29 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.
2023లో 7.8 తీవ్రతతో భూకంపం
మరోవైపు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆకాంక్షించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తుర్కియోలో మారణహోమాన్ని సృష్టించింది. భూకంప ధాటికి 53వేలకుపైగా ప్రజలు మృతిచెందగా, వందల్లో భవనాలు నేలమట్టమయ్యాయి.

Earthquake: తుర్కియేలో భారీ భూకంపం- రిక్టర్ స్కేల్​పై 6.1తీవ్రత

భూకంప ధాటికి 16 భవనాలు నేలమట్టం
ప్రమాద తీవ్రత గురించి టర్కిష్​ మంత్రి అలీ యెర్లికాయ విలేకర్లతో మాట్లాడారు. ఇస్తాంబుల్​, పర్యటక కేంద్రమైన ఇజ్మీర్​తో సహా దేశంలో పశ్చిమాన ఉన్న అనేక నగరాల్లో భూకంపం సంభవించిదని పేర్కొన్నారు. ప్రమాద స్థలానికి వెంటనే విపత్తు దళాలు చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయని చెప్పారు. భూకంప ధాటికి 16 భవనాలు కూలిపోయాయన్నారు. మూడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో అందులో ఉన్న ఆరుగురు నివాసితులు ఉన్నారని, వారిని రెస్క్యూటీం క్షేమంగా బయటకు తీశారని ఆయన తెలిపారు. అయితే ఓ 80 ఏళ్ల వృద్ధుడు శిథిలాల నుంచి వెలికి తీసిన కొద్ది సేపటికే మరణించారని చెప్పారు.
గతంలో భూకంప ధాటికి 53,000 మంది బలి!
తుర్కియేలో గతంలో కూడా భూకంపాలు సంభవించాయి. 2023 ఫిబ్రవరిలో నైరుతిలో సంభవించిన భూకంపం దాదాపు 53,000 మందిని బలితీసుకుంది. పురాతన నగరం ఆంటియోక్​ ఉన్న అంటక్యను నాశనం చేసింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో తుర్కియే ఒకటని నిపుణులు చెబుతున్నారు.

టర్కీలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందా?
టర్కీలోని చాలా ప్రాంతాలలో క్రమం తప్పకుండా భూకంపాలు మరియు ప్రకంపనలు సంభవిస్తాయి. ఇవి అధిక తీవ్రతతో ఉంటాయి, మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిస్తాయి మరియు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి.
టర్కీ భూకంపానికి భారతదేశం ఎలా సహాయం చేసింది?
టర్కీకి సహాయం చేయడానికి భారతదేశం "ఆపరేషన్ దోస్త్"ను ప్రారంభించింది...
ఫిబ్రవరి 2023లో సంభవించిన వినాశకరమైన భూకంపం తర్వాత టర్కీకి సహాయం చేయడానికి భారతదేశం "ఆపరేషన్ దోస్త్"ను ప్రారంభించింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు, శోధన మరియు రెస్క్యూ డాగ్ స్క్వాడ్‌లు, వైద్య బృందాలు, ఫీల్డ్ ఆసుపత్రులు, మందులు, సహాయ సామగ్రి మరియు ప్రత్యేక పరికరాలతో సహా అనేక బ్యాచ్‌ల సహాయాన్ని భారతదేశం పంపింది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/india-welcomes-donald-trump-putin-talks/international/528283/

Earthquake Latest News Breaking News Natural Disaster Richter scale Telugu News Turkiye World News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.