తుర్కియే (Turkey ) దేశాన్ని మళ్లీ భూకంపం (Earthquake ) భయపెట్టింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కొన్ని క్షణాల పాటు నేలను కంపింపజేసింది. భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైకి వచ్చిన వారు భయాందోళనతో తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు యత్నించారు.
వాహనాలు ఊగిపోవడం, భవనాలు స్వల్పంగా కంపించటం
ఈ భూకంపం సమయంలో రహదారుల్లో వెళ్తున్న వాహనాలు ఊగిపోవడం, భవనాలు స్వల్పంగా కంపించటం వంటి దృశ్యాలు స్థానికులు మొబైల్ ఫోన్‌ల్లో చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతూ, భూకంప తీవ్రతను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు రికార్డుకి రాలేదు.
స్థానిక ప్రజలకు అలర్ట్
భూకంపం తర్వాత తుర్కియే విపత్తు నిర్వహణ విభాగం అప్రమత్తమై అపాయ సమీక్షలు చేపట్టింది. భవనాల్లో బలహీనతలపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు. స్థానిక ప్రజలకు అలర్ట్ జారీ చేస్తూ, ఏవైనా అవాంతరాలు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలంటూ సూచించారు. గతంలో తీవ్రమైన భూకంపాల ధాటికి తీవ్రంగా నష్టపోయిన తుర్కియే, భూకంపాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
Read Also : HYD-Metro : హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నెటిజన్ల ఫైర్