Latest News: Earthquake in Russia – రష్యాలో భారీ భూకంపం తో సునామీ హెచ్చరికలు

Read Time:  1 min
Earthquake in Russia
Earthquake in Russia
FONT SIZE
GET APP

రష్యా (Russia) తూర్పుతీరంలోని కమ్చత్కా ద్వీపకల్పంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ (Richter scale) పై 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే (యూఎస్ఎస్) ప్రకటించింది. ఈ శక్తివంతమైన భూకంపంతో అధికారులు సమీప తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసారు. ప్రజలు ఇండ్లలో నుంచి పరుగులుతీస్తూ బయటకు వచ్చారు. భూకంపం (Earthquake) సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని రష్యా తీర ప్రాంతాలపై ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

భయకంపితులైన ప్రజలు

గత జులై నెలలో ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించిన విషయం విధితమే. ఆసమయంలో పసిఫిక్ (Pacific) అంతటా సునామీ అలలు ఎగసిపడటంతో హవాయి నుంచి జపాన్ (Japan) తో సహా పలు దేశాలు తీరప్రాంతప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాయి. కాగా శనివారం ఉదయం భూకంపం రావడంతో ప్రజలు భయకంపితులైఇండ్లలో నుంచి బయటికి వచ్చారు.

 Earthquake in Russia
Earthquake in Russia

గతంలో మయన్మార్, థాయ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లలో భారీ భూకంపాలు సంభవించాయి.ఇటీవల ఈ భూకంపాలు పెరిగిపోవడంతో ఎప్పుడేమి జరుగుతుందో తెలియని భయంతో ప్రజలు మనుగడను సాగిస్తున్నారు.భారీ భవంతులు, అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం తరచూ భూమి లోతుల్లోకి తవ్వకాలు చేస్తుండడం భూమి ఉపరితలంలూజుగా మారి తరచూ భూకంపాలకు కారణమని భూగర్భ నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/boat-accidents-in-congo-193-people-dead/international/546339/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.