Earthquake : అఫ్గనిస్తాన్ లో భూకంపం…రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు

Read Time:  1 min
Earthquake in Afghanistan...magnitude 4.7 on the Richter scale recorded
Earthquake in Afghanistan...magnitude 4.7 on the Richter scale recorded
FONT SIZE
GET APP

Earthquake : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం రాగా.. ఇండియా,చైనా,వియత్నా,బంగ్లాదేశ్‌లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ అఫ్గనిస్తాన్ లో భూకంపం వచ్చింది. ఉదయం 5.16 గంటలకు 180 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కూల్ పై 4.7 గా నమోదయ్యిందని వెల్లడించింది. జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటిఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం జరిగలేదు.

అఫ్గనిస్తాన్ లో భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై

మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది

భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 4.3, 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇటువంటివి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాగా, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉంది. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదయ్యింది.

150 మందికి పైగా మరణించారు

కాగా, నిన్న మయన్మార్ , బ్యాంకాక్ లో నిమిషాల వ్యవధిలోనే ఆరు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 150 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 700 మందికి పైగా గాయపడ్డారు. వందలాది బిల్డింగ్ లు కుప్పకూలాయి. ఎక్కడిక్కడ రోడ్లు,బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి. మయన్మార్‌లో తీవ్ర భూకంపం సంభవించిన దరిమిలా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయం కొనసాగుతుంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.