విద్యార్థి నేత హాదీ(Hadi) హత్య కేసులో ఫైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ లను బంగ్లాదేశ్ పోలీసులు అనుమానితులగా గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా పైసల్ దుబాయ్ లో ఉన్నట్లు వెల్లడైంది. ఈ హత్యతతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. వీడియోలో పైసల్ మాట్లాడుతూ..తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. దీని నుంచి తనని తాను రక్షించుకునేందుకు దుబాయ్ కు వచ్చినట్లు తెలిపాడు. జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించాడు. ఈ సందర్భంఆ హాదీతో తనకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపాడు. ప్రభుత్వ కాంట్రాక్ట్ లు దక్కించుకోవడం కోసం హాదీ రాజకీయ కార్యకలాపాలకు తాను విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Read Also: America: సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?
భారత్ వైపు వేలెత్తి చూపిన బంగ్లా పోలీసులు
డిసెంబర్ 12వ తేదీన హాదీపై దాడి జరిగిన తర్వాత ఫైసల్, ఆలంగీర్ షేక్ వంటి నిందితులు దేశం దాటి పారిపోయారని పోలీసులు గుర్తించారు. వీరు భారత్‌లోకి ప్రవేశించారని.. ముఖ్యంగా మేఘాలయ సరిహద్దుల ద్వారా ఇండియాలోకి చొరబడ్డారని ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత భద్రతా దళాలు (BSF), మేఘాలయ పోలీసులు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సరిహద్దు దాటి ఎవరూ భారత్‌లోకి రాలేదని.. బంగ్లాదేశ్ పోలీసులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిందితుడు దుబాయ్ నుంచి వీడియో విడుదల చేయడంతో.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అతడిని పట్టుకునేందుకు ఢాకా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: