📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Dubai Ruler : సామాన్యుడిగా ట్రామ్‌లో ప్రయాణించిన దుబాయ్‌ పాలకుడు

Author Icon By Sudha
Updated: July 23, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా దేశాధినేతలు గట్టి భద్రత చర్యల మధ్యే ప్రజల్లో కనిపిస్తారు. వారెక్కడికైనా వెళ్తే ముందుగానే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు జరుగుతుంటాయి. కానీ దుబాయ్ పాలకుడు (Dubai Ruler)షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్‌ ఈ సాంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించారు. ఇటీవల ఆయన దుబాయ్‌లోని ఓ పబ్లిక్ ట్రామ్‌లో (Public Tram)సాధారణ ప్రయాణికుల మధ్య ప్రయాణించడంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రయాణాన్ని కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వేగంగా వైరల్ అయింది. ట్రామ్‌లో ఆయన్ను చూసిన ప్రజలు క్షణాల్లో గుర్తించి ఆశ్చర్యపోయారు. అతని సాదాసీదా ప్రవర్తనకు పలువురు కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటన దుబాయ్ పాలకుడు (Dubai Ruler) ప్రజలతో ఎంత దగ్గరగా ఉండాలనే దృక్పథాన్ని తెలియజేస్తోంది. వీఐపీ బేహేవియర్‌కు భిన్నంగా ప్రజల మధ్య కలిసిమెలిసి ఉండే ఆయన శైలికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.

Dubai Ruler : సామాన్యుడిగా ట్రామ్‌లో ప్రయాణించిన దుబాయ్‌ పాలకుడు

పాలకుడి సింప్లిసిటీ

దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ తాజాగా పబ్లిక్‌ ట్రామ్‌లో ప్రయాణించారు. ట్రామ్‌ స్టేషన్‌ సందర్శనకు వచ్చిన ఆయన.. అధికారులతో మాట్లాడారు. అనంతరం రద్దీగా ఉన్న ట్రామ్‌లో సామాన్యుడిగా ప్రయాణించారు. అందులో ఉన్న ప్రయాణికులు పాలకుడిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. షేక్‌ మొహమ్మద్‌ ట్రామ్‌లో ఓ పక్కన కూర్చొని ఉన్న దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు దుబాయ్‌ పాలకుడి సింప్లిసిటీని మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, దుబాయ్‌ పాలకుడు( Dubai Ruler) షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ ఇలా ఎలాంటి హడావుడి లేకుండా సామాన్యులతో కలిసి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించడం ఇదేమీ మొదటి సారి కాదు. 2023లో ఓసారి దుబాయ్‌ మెట్రోలో ప్రయాణించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు.

దుబాయ్ రిచెస్ట్ షేక్?

మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తన సంపదలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్ నుండి సంపాదించిన ఒక బిలియనీర్ ప్రధానంగా అభివృద్ధి ప్రపంచంలో సేవలందించాడు.

షేక్ ఎందుకు ధనవంతులు?

మధ్యప్రాచ్యంలో పెద్ద చమురు నిల్వలు మరియు సంపన్న కుటుంబాల సంఖ్య కారణంగా , ఈ ప్రాంతంలోని కొంతమంది షేక్‌లు చాలా ధనవంతులు – ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన బిలియనీర్లలో కొందరుగా స్థానం పొందారు.

అత్యంత ధనిక అరబ్ రాజ కుటుంబం?

$1.4 ట్రిలియన్ల నికర విలువతో, సౌద్ హౌస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న రాజకుటుంబంగా పరిపాలిస్తోంది. 1932 నుండి సౌదీ అరేబియాను పాలిస్తున్న వారి సంపద ప్రధానంగా రాజ్యం యొక్క విస్తారమైన చమురు నిల్వల నుండి వచ్చింది, ఇది నేడు ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటైన సౌదీ అరాంకో ద్వారా నియంత్రించబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: India – Pak : భారత్ కంటే సేఫెస్ట్ కంట్రీగా పాకిస్థాన్..?

Breaking News Dubai News Dubai Ruler latest news Public Tram Public Transport Sheikh Mohammed bin Rashid Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.