📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Dubai దుబాయ్‌ యువరాణి ఇన్‌స్టాలో విడాకులు..ర్యాపర్‌తో ఎంగేజ్‌ మెంట్‌

Author Icon By Vanipushpa
Updated: August 28, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దుబాయ్‌ యువరాణి షేకా మహ్రా మళ్లీ ఒకసారి వార్తాల్లో నిలిచారు. తాజాగా ఆమె మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది సోషల్ మీడియా ఇన్‌స్టాలో భర్తకు విడాకులు(Divorce On Instagram) ప్రకటించి సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ప్రకటించి సంచలనం రేపారు. ఈ మేరకు ప్రముఖ ర్యాపర్‌ ఫ్రెంచ్‌ మోంటానా(40)తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ర్యాపర్‌మోంటానా అధికార ప్రతినిధి ధ్రువీకరించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

Dubai దుబాయ్‌ యువరాణి ఇన్‌స్టాలో విడాకులు..ర్యాపర్‌తో ఎంగేజ్‌ మెంట్‌

వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు సమాచారం

గతేడాది భర్తకు విడాకులు ప్రకటించిన షేకా మహ్రా ఆనాటినుంచి ర్యాపర్‌తో డేటింగ్‌(Dating) లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విడాకులు ప్రకటించిన కొన్నాళ్లకే షేకా మహ్రా.. మోంటానా తో కలిసి దుబాయ్‌ వీధుల్లో తిరగడం గమనార్హం. వీరిద్దరూ అనేకసార్లు దుబాయ్‌ వీధుల్లో.. రెస్టారెంట్లలో కలిసి కనిపించారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లోనూ వీరు దర్శనమిచ్చారు. అప్పటికే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఇద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న షేకా మహ్ర
షేకా మహ్రా దుబాయ్‌ రాజు యూఏఈ ప్రధానమంత్రి అయిన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కూతురు. 31 ఏళ్ల మహ్రా బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించారు. ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా తీసుకున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. మహ్రాకు దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో 2023 మే 27న వివాహం జరిగింది. అయితే, ఈ బంధం ఎంతోకాలం నిలువలేదు. గతేడాది బిడ్డకు జన్మనిచ్చిన మహ్రా ఆ తర్వాత కొంతకాలానికే భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ‘ఐ డివోర్స్‌ యూ’(I Divorce You) అంటూ ఇన్‌స్టాలో విడాకుల ప్రకటన చేసి సంచలనంగా మారారు. ఆ తర్వాత ‘డివోర్స్‌’ పేరుతో పర్‌ఫ్యూమ్‌ విక్రయాలు ప్రారంభించడం విశేషం.
గతంలో వ్యాపారవేత్త అయిన మోంటానా
ర్యాపర్‌ ఫ్రెంచ్‌ మోంటానా మొరాకో అమెరికన్‌. అయన అసలు పేరు కరీం ఖర్బౌచ్. వయస్సు 40 ఏండ్లు. ‘అన్‌ఫర్‌గటబుల్‌’, ‘నో స్టైలిస్ట్‌’ వంటి ఆల్బమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందాడు. మోంటానా గతంలో వ్యాపారవేత్త అయిన నదీన్‌ను వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఆయనకు 16 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

దుబాయ్ రాజుకు ఎంత మంది భార్యలు ఉన్నారు?

దుబాయ్ ప్రస్తుత పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కు కనీసం ఆరుగురు అధికారిక భార్యలు ఉన్నారు మరియు బహుశా ఇంకా చాలా మంది ఉన్నారు, అతని మొదటి భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్ అల్ మక్తూమ్, అతని దీర్ఘకాల జీవిత భాగస్వామి మరియు అతని వారసుడు హమ్దాన్ తల్లి.

దుబాయ్ యువరాణి ఎవరు?
దుబాయ్ యువరాణి షేఖా మహరా ఇన్‌స్టాగ్రామ్ విడాకులు అందరినీ షాక్‌కి గురిచేశాయి
దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/valentina-gomez-islam-controversy/international/537307/

Celebrity News Divorce Dubai Princess Engagement Instagram post Latest News Breaking News Rapper Royal Family Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.