Dubai: ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

Read Time:  1 min
Dubai: ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన
FONT SIZE
GET APP

Dubai: ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన తమిళనాడుకు చెందిన తిలక్‌కుమార్‌, ఆయన భార్య షామిని రమేశ్‌ ఎనిమిదేళ్ల క్రితం మెరుగైన జీవితం కోసం దుబాయ్ వెళ్లారు. ఇటీవల వారిని చూసేందుకు వెళ్లిన తిలక్‌కుమార్ తల్లి తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డారు. గత 40 రోజులుగా ఆమె అక్కడి ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇంకా కనీసం రెండు నెలల పాటు వెంటిలేటర్ అవసరమని వైద్యులు చెబుతున్నారు అని తిలక్‌కుమార్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు

Read Also: Moradabad Crime: సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

Dubai: ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన
Dubai: Mother Undergoing Treatment in ICU Son Distressed Over ₹50 Lakh Bill

ఐసీయూలో తల్లి.. వైద్యం కోసం వెతుకులాట

ఆసుపత్రి ఖర్చు రోజుకు సుమారు రూ. 3 లక్షల బిల్లు అవుతుండగా, ఇప్పటివరకు మొత్తం బిల్లు రూ. 1.25 కోట్లు దాటింది. రోజురోజుకూ భారం పెరుగుతుండటంతో తక్కువ ఖర్చుతో చికిత్స అందించేందుకు తల్లిని భారత్‌కు తరలించాలని నిర్ణయించుకున్నారు. కమర్షియల్ మెడికల్ ఎస్కార్ట్ ఫ్లైట్‌లో రూ. 7 లక్షల ఖర్చుతో తరలించేందుకు వైద్యులు అనుమతించారు. కానీ, యుద్ధ వాతావరణం కారణంగా ఆ విమానం రద్దయింది.

ప్రస్తుతం ప్రైవేట్ ఎయిర్ అంబులెన్స్ ఒక్కటే మార్గం. అయితే, ఉద్రిక్తతల కారణంగా దీని ఖర్చు రూ. 50 లక్షలకు చేరింది. మేము ఉద్యోగులం. ఇంత పెద్ద మొత్తం భరించే స్థితిలో లేము. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 50 లక్షలు సమకూర్చడమే అని తిలక్‌కుమార్ వాపోయారు.

డిశ్చార్జి సమయంలో బిల్లు చెల్లించాల్సి ఉండటంతో ఆసుపత్రి నుంచి కొంత డిస్కౌంట్ వస్తుందని ఆశిస్తున్నారు. అయినా కూడా భారం తగ్గడం లేదు. ఎయిర్ అంబులెన్స్‌ను బుక్ చేసుకోవడం కూడా కష్టంగా మారిందని షామిని తెలిపారు. సమయం గడిచిపోతుండటంతో కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నామని, దాతలు స్పందించి తన‌ తల్లిని కాపాడాలని తిలక్‌కుమార్ వేడుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.