ప్రపంచ దేశాల్లో ‘సిటీ ఆఫ్ గోల్డ్’గా పేరుగాంచిన దుబాయ్, తన బంగారు వారసత్వాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. చారిత్రక డీరా ప్రాంతంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘గోల్డ్ స్ట్రీట్’ (Gold Street) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ‘ఇత్రా దుబాయ్’ అనే సంస్థ డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్, కేవలం పర్యాటక ఆకర్షణగానే కాకుండా ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులను ఆకర్షించే భారీ వాణిజ్య కేంద్రంగా అవతరించనుంది. ఈ వీధి నిర్మాణంలో నిజమైన బంగారపు పూతతో కూడిన ఎలిమెంట్లను ఉపయోగిస్తుండటం ఈ ప్రాజెక్టుకే హైలైట్‌గా నిలవనుంది.
Phone Tapping Case : ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ
ఈ ‘దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్’ ప్రాజెక్టులో భాగంగా వెయ్యికి పైగా అత్యాధునిక ఆభరణాల విక్రయశాలలు ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన మలబార్ గోల్డ్, తనిష్క్ వంటి బ్రాండ్లతో పాటు, జోయాలుక్కాస్ సంస్థ మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద స్టోర్‌ను సుమారు 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇక్కడ నిర్మిస్తోంది. విలాసానికి మారుపేరుగా నిలిచే ఈ ప్రాంతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులు మరియు వ్యాపారులకు ఒకే వేదికగా (One-stop destination) మారబోతోంది. భవిష్యత్తులో దుబాయ్ ఎగుమతి సామర్థ్యాన్ని ఈ డిస్ట్రిక్ట్ మరింత పెంచనుంది.
పర్యాటకుల సౌకర్యార్థం ఈ గోల్డ్ డిస్ట్రిక్ట్ పరిధిలో 1000కి పైగా గదులతో కూడిన 6 భారీ విలాసవంతమైన హోటళ్లను నిర్మిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులు ఈ గోల్డ్ స్ట్రీట్‌ను సందర్శించేందుకు వీలుగా ‘బిగ్ బస్’ వంటి ప్రత్యేక రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విలాసవంతమైన షాపింగ్ అనుభవంతో పాటు, దుబాయ్ వాణిజ్య వైభవాన్ని చాటిచెప్పేలా రూపొందుతున్న ఈ గోల్డ్ స్ట్రీట్, త్వరలోనే ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచినా ఆశ్చర్యం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com