📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Latest Telugu News: Japan: మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్

Author Icon By Vanipushpa
Updated: December 12, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల
మద్యం తాగి సైకిళ్లు నడుపుతూ దొరికిన సుమారు 900 మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌లను జపాన్ పోలీసులు సస్పెండ్ చేసినట్లు స్థానిక మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ సైక్లిస్టులు “కారు నడిపేటప్పుడు కూడా ఇలాగే చేస్తే ప్రమాదాలకు అవకాశం ఉంది” అని అధికారులు భావించడమే దీనికి కారణం. సైక్లిస్టులపై కఠినమైన జరిమానాలు విధించే కొత్త ట్రాఫిక్ చట్టాలను జపాన్ తీసుకురావడంతో, 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సస్పెండ్ చేసిన కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే బాగా పెరిగింది. 2024 నవంబర్‌లో ప్రారంభమైన కొత్త నిబంధనల ప్రకారం, మద్యం తాగిన తర్వాత సైకిల్ తొక్కే ఎవరికైనా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా 5,00,000 యెన్ (రూ.2.8 లక్షలు) వరకు జరిమానా విధించవచ్చు.
తాగి సైకిల్ తొక్కేవారిని శిక్షించే పరిమితిని కూడా తగ్గించారు. నిబంధనల ప్రకారం, బ్రీత్ ఆల్కహాల్ పరీక్షలో లీటరుకు 0.15 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తే సైక్లిస్టులకు జరిమానా విధించవచ్చు.

Read Also: Indigo Auto-Rickshaw: ఇండిగో ఎయిర్‌లైన్స్ Vs ఇండిగో ఆటో: హర్ష్ గోయెంకా ఫన్నీ పోస్ట్

Japan

ప్రమాదాలు పెరగడంతో ఈ నిర్ణయం

అంతకుముందు, సైకిళ్లను సరిగ్గా నడపలేని రైడర్లపై మాత్రమే జరిమానాలు అధికంగా ఉండేవి.సైకిలిస్టులకు మద్యం అందించే వ్యక్తులకు లేదా తాగినవారికి సైకిల్ ఇచ్చినవారికీ జరిమానాలు వర్తించనున్నాయి. “తాగి సైక్లింగ్ చేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది” అని స్థానిక వార్తాపత్రిక యోమియురి షింబున్‌తో ఒక పోలీసు అధికారి చెప్పారు.
“తాగి నడపవద్దు అనే నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు. 2024 నవంబర్ నుంచి 2025 జూన్ మధ్య జపాన్‌లో 4,500 మందికి పైగా మద్యం తాగాక సైకిల్ తొక్కుతూ పట్టుబడ్డారని మైనిచి వార్తాపత్రిక పోలీసు గణాంకాలను ఉటంకిస్తూ రిపోర్టు చేసింది. సైకిళ్ల రైడింగ్ విషయంలో నిబంధనలను జపాన్ అధికారులు సమీక్షిస్తూ వస్తున్నారు. కరోనా సమయం నుంచి దేశంలో సైకిల్ ఎక్కువగా వాడుతున్నారు. అదేసమయంలో సైక్లిస్టుల తప్పిదాలు చాలా ప్రమాదాలకు కూడా దారితీశాయి. 2023లో జపాన్‌లో 72 వేలకు పైగా సైకిల్ ప్రమాదాలు నమోదయ్యాయి, ఇది దేశంలో జరిగిన మొత్తం ట్రాఫిక్ ప్రమాదాలతో పోలిస్తే 20 శాతం ఎక్కువగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. వేల సంవత్సరాలుగా జపనీయుల సామాజిక జీవితంలో మద్యం ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

alcohol violations Breaking News in Telugu Driving License Suspension drunk cycling Google News in Telugu Latest In telugu news Legal action Public Safety road safety rules Telugu News Today traffic laws transportation policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.