📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Donald Trump: ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Author Icon By Anusha
Updated: March 1, 2026 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Donald Trump: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ గనుక సాహసించి దాడులు కొనసాగిస్తే, ఆ దేశం “చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని” భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విమాన వాహక నౌకలు ఇప్పటికే మధ్యధరా సముద్రంలో మోహరించాయి.

Read Also: Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

ట్రంప్ ఘాటు హెచ్చరిక..

ఖమేనీ మరణానికి ప్రతీకారంగా భారీ ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో స్పందించారు. ‘‘ఇరాన్ ఈరోజు మునుపెన్నడూ లేనంత గట్టిగా కొడతామని చెబుతోంది. వారు ఆ పని చేయకపోవడమే మంచిది. ఒకవేళ వారు గనుక సాహసిస్తే, మేము వారిపై ప్రయోగించే శక్తి ప్రపంచం ఇప్పటివరకు చూడని రీతిలో ఉంటుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు.

Donald Trump’s warning to Iran

అణు చర్చలు విఫలం కావడం, ఇరాన్ మళ్ళీ అణు కార్యకలాపాలు ప్రారంభించిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’  చేపట్టాయి. శనివారం జరిగిన ఈ మెరుపు దాడుల్లో ఖమేనీ నివాసమే లక్ష్యంగా క్షిపణులు దూసుకెళ్లాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఫోటోను ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు స్వయంగా చూసినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.