📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest News: Donald Trump: కెనడాపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం

Author Icon By Anusha
Updated: October 26, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా – కెనడా (Canada) వాణిజ్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పొరుగు దేశమైన కెనడా రూపొందించిన ఒక టెలివిజన్ వాణిజ్య ప్రకటన కారణంగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తీ వ్ర అసహనానికి గురయ్యారు.అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ (Ronald Reagan) టారీఫ్‌లపై గతంలో చేసిన ప్రసంగం ఆడియో క్లిప్పులను కెనడా టీవీ యాడ్‌కు జోడించడం ట్రంప్‌‌ (Donald Trump) ను ఆగ్రహానికి గురిచేసింది. కెనడాపై ఇటీవల విధించిన 35 శాతం నుంచి 50 శాతం టారీఫ్‌లు విధించగా.. తాజా 10 శాతం వీటికి అదనం.

Read Also: Louvre Museum: లావ్రే మ్యూజియంలో ఇటీవల భారీ చోరీ

కెనడా వాణిజ్య ప్రకటనపై ట్రంప్ స్పందిస్తూ ‘ఆ యాడ్‌ను వెంటనే తొలగించాల్సింది కానీ పూర్తిగా మోసమని తెలిసినా కానీ వారు నిన్న రాత్రి వరల్డ్ సిరీస్ (World Series) సందర్భంగా ప్రసారం చేశారు’ అని ట్రంప్ (Donald Trump) తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Donald Trump

ఆసియా పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. ‘వాస్తవాలను తీవ్రంగా వక్రీకరించారు. రెచ్చగొట్టే చర్యల కారణంగా ప్రస్తుతం ఉన్న సుంకాలపై అదనంగా 10% పెంచుతున్నాను’ అని ట్రంప్ తెలిపారు.కెనడాలోని ఒంటారియో ప్రావిన్సుల ప్రభుత్వం రూపొందించిన వాణిజ్య ప్రకటనలో 1987లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రసంగాన్ని జోడించింది.

.ఇవి తీవ్రమైన వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయి

విదేశీ వస్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రతికూల ప్రభావాల గురించి రీగన్ హెచ్చరించారు.‘అధిక టారీఫ్‌లు అనివార్యంగా విదేశాలపై ప్రతీకార చర్యలను ప్రేరేపిస్తాయి. ఇవి తీవ్రమైన వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయి’ అని అన్నారు. రోనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ వెబ్‌సైట్‌ (Presidential Library website) లో ఆయన ప్రసంగ పత్రంలోని ఈ ఆడియో క్లిప్‌ను కెనడా తన టీవీ యాడ్‌లో జతచేసింది.

గతంలో అమెరికా తమపై విధించిన సుంకాలకు కెనడా కూడా టారీప్‌లు విధించిన సంగతి తెలిసిందే.మరోవైపు, రోనాల్డ్ రీగన్ ఫౌండేషన్ దీనిపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒంటారియో ప్రభుత్వం సెలెక్టివ్‌గా ఆడియో, వీడియోలను వాడిందని,ఈ విషయంలో చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపింది.

ట్రంప్ లిబరేషన్ డే పేరుతో

మరోవైపు, వివాదాస్పద యాడ్‌ను సోమవారం నాటికి తొలగిస్తామని ప్రకటించింది.తద్వారా చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. కానీ, ట్రంప్ అంతలోనే బాంబు పేల్చడం గమనార్హం. ట్రంప్ లిబరేషన్ డే పేరుతో ఏప్రిల్ 1న ప్రకటించిన సుంకాలు ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ రంగాల్లో కెనడాపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ టారీఫ్‌ల వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారాలు ఆర్థిక ఒత్తిడికి గురయ్యాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Canada TV advertisement issue donald trump tariffs latest news Reagan speech controversy Telugu News USA Canada trade tensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.