US criminal aliens database : అక్రమ వలసదారులు, కరుడుగట్టిన నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న Donald Trump ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం Department of Homeland Security (DHS) ‘వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్’ (WWW) పేరుతో అత్యంత ప్రమాదకర నేరగాళ్ల జాబితాను బహిర్గతం చేసింది. మొత్తం 25 వేల మంది ‘క్రిమినల్ ఏలియన్స్’తో కూడిన ఈ డేటాబేస్‌లో 89 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నట్లు వెల్లడైంది.
ఈ జాబితాలో హత్యలు, లైంగిక దాడులు, డ్రగ్స్ స్మగ్లింగ్, భారీ ఆర్థిక మోసాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారిని చేర్చారు. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన నేరగాళ్లను వీధుల నుంచి ఎలా తొలగిస్తున్నామో ప్రజలకు స్పష్టంగా చూపడానికే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో నేరగాళ్ల ఫోటోలు, పేర్లు, చేసిన నేరాలు, జాతీయత వంటి వివరాలను బహిరంగంగా ఉంచారు.
Read Also: Vijay Sethupathi: రామాయణం సినిమాలో ‘మక్కల్ సెల్వన్’?
భారత సంతతి నేరగాళ్లలో ఎక్కువ మంది వార్ ఫ్రాడ్, ట్యాక్స్ ఫ్రాడ్ వంటి ఆర్థిక నేరాలు, హింసాత్మక దాడులు, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితా విడుదలతో ప్రవాస భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒకవైపు అక్రమ వలసదారులపై సామూహిక బహిష్కరణ చర్యలను ట్రంప్ ప్రభుత్వం వేగవంతం చేస్తుండగా, మరోవైపు ఈ నిర్ణయంపై డెమోక్రాట్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని అంచనాలు ఉన్నాయి. అయితే దేశాన్ని నేరరహితంగా మార్చే వరకు ఈ ‘క్లీన్-అప్ డ్రైవ్’ కొనసాగుతుందని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: