हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest News: Donald Trump: సౌత్ ఆఫ్రికాలో జరిగే జి-20ను బహిష్కరిస్తున్నాం: ట్రంప్

Anusha
Latest News: Donald Trump: సౌత్ ఆఫ్రికాలో జరిగే జి-20ను బహిష్కరిస్తున్నాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ–20 సదస్సును అమెరికా బహిష్కరించాలని నిర్ణయించినట్లు ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు,పాల్గొనే ఈ సదస్సుకు అమెరికా దూరంగా ఉండటమే కాకుండా, దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన విమర్శలు ప్రస్తుతం వివిధ దేశాల్లో తీవ్ర ప్రతిస్పందనలకు దారితీస్తున్నాయి.

Read Also: Pakistan: పాక్ సైన్యంలో కొత్తగా ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ పదవి 

జీ-20 సదస్సు బహిష్కరణ నిర్ణయం

శనివారం తన సొంత సోషల్ మీడియా (Social media) ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. “జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తి అవమానకరం” అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

“ఆ దేశంలో తెల్లజాతి రైతులపై జరుగుతున్న హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు వంటి దారుణాలు ప్రపంచానికి తెలియాలి. ఈ దారుణాలపై దక్షిణాఫ్రికా (South Africa) చర్యలు తీసుకోనంత వరకు.. ఆ దేశంలో జరిగే ఏ అంతర్జాతీయ వేదికకు అమెరికా తరపున ఎవరూ హాజరు కాకూడదు” అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

జీ-20 గ్రూప్ నుండి దక్షిణాఫ్రికాను తొలగించాలి

తాజాగా మయామిలో జరిగిన ఒక ప్రసంగంలో ట్రంప్.. దక్షిణాఫ్రికాను ఏకంగా జీ-20 గ్రూప్ నుంచే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సదస్సును బహిష్కరించాలని నిర్ణయించడం ద్వారా తన వైఖరిని మరింత బలంగా చాటుకున్నారు. ట్రంప్ తన భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రకటించారు.

Donald Trump
Donald Trump

వచ్చే ఏడాది ఫ్లోరిడాలోని మయామిలో నిర్వహించే జీ-20 సదస్సు కోసం వేచి చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. జీ-20 సదస్సు (G-20 Summit) బహిష్కరణ నిర్ణయంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం గట్టి జవాబిచ్చింది. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా పూర్తిగా తిప్పికొట్టింది. త

దక్షిణాఫ్రికా ప్రభుత్వం గట్టి జవాబిచ్చింది

మ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ జీవన ప్రమాణాలు, అధిక ఆర్థిక శక్తిని కలిగి ఉన్నారని స్పష్టం చేసింది. వర్ణవివక్ష అనే తెల్లజాతి పాలనా వ్యవస్థ ముగిసిన ముప్పై సంవత్సరాల తరువాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై తెల్లజాతి ప్రజలదే పైచేయిగా ఉందని దక్షిణాఫ్రికా ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు.

దేశంలో తెల్లజాతి మైనారిటీ రైతులు ఎటువంటి వివక్షకు గురికావడం లేదని, వారిపై హింస జరుగుతున్నట్టు ట్రంప్‌కు తప్పుడు సమాచారం అందిందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పేర్కొన్నారు.

షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు ఉండదు

ట్రంప్ బహిష్కరణ ప్రకటన చేసినప్పటికీ.. జీ20 సదస్సు షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు ఉండబోదని దక్షిణాఫ్రికా స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా 2024 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 నవంబర్ 30వ తేదీ వరకు జీ20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. ఈ ఏడాది జీ20 దేశాల అధినేతల సదస్సు నవంబర్ 22, 23 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.

ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే మొదటిసారి కావడం చారిత్రక అంశం. ఈ సదస్సును విజయవంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరుకానున్న తరుణంలో.. ట్రంప్ బహిష్కరణ ప్రకటన అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870