📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump Tariff: 50 రోజుల్లో యుద్ధం ఆపాలని రష్యాకు ట్రంప్‌ హుకుం

Author Icon By Vanipushpa
Updated: July 15, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రష్యా(Russia)పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. రష్యా 50 రోజుల్లో ఉక్రెయిన్‌(Ukraine)తో యుద్ధం ఆపేలా ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది సాధ్యం కాకపోతే 100% సుంకాలతో శిక్షిస్తానని హెచ్చరించారు.
“పుతిన్‌ రోజు మాటలు, రాత్రి బాంబులు!” – ట్రంప్
నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సమావేశంలో ట్రంప్ పుతిన్‌(Putin)పై తీవ్ర విమర్శలు చేశారు. “పుతిన్‌ పగలు బాగా మాట్లాడతారు, కానీ రాత్రికి బాంబులు కురిపిస్తారు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Trump Tariff: 50 రోజుల్లో యుద్ధం ఆపాలని రష్యాకు ట్రంప్‌ హుకుం

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ప్రత్యేక దూత భేటీ
ట్రంప్ ప్రత్యేక దూతగా లెఫ్టినెంట్‌ జనరల్ కీత్ కెల్లోగ్‌ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతం, సంయుక్త ఆయుధాల ఉత్పత్తి, అమెరికా సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపారు.
రష్యాకు సాయం చేస్తే 500% టారిఫ్‌లు
రష్యాకు సహకరించే దేశాలపై 500 శాతం దిగుమతి సుంకాలు విధించేలా బిల్లు రూపొందించామని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ తెలిపారు. ఉక్రెయిన్‌కు పేట్రియట్ గగనతల రక్షణ వ్యవస్థలు, భారీ ఆయుధాలను పంపించనున్నట్లు తెలిపారు.
“యుద్ధాలను ఆపేందుకు వాణిజ్యమే నా ఆయుధం!” – ట్రంప్
ట్రంప్ మాట్లాడుతూ, “యుద్ధాలు ఆపేందుకు నేను వాణిజ్య ఒప్పందాలను ఉపయోగిస్తా” అని పేర్కొన్నారు. భారత్-పాక్ ఘర్షణల సందర్భంలో కూడా ఇదే విధంగా వ్యవహరించానని గుర్తు చేశారు. దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధాలను ఆపడానికి తాను వాణిజ్యాన్ని వాడుకుంటానని ట్రంప్ అన్నారు. ఇది చాలా గొప్పగా ఉంటుందంటూ మరోసారి భారత్​-పాక్​ ఘర్షణల గురించి ప్రస్తావించారు. వివిధ దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలను తాను వాణిజ్య ఒప్పందాలతో ముడిపెట్టి ఆపినట్లు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Nimisha Priya: నిమిషా ప్రియా: యెమెన్‌లో ఉరిశిక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వ స్పందన

#telugu News Donald Trump NATO meeting Russia-Ukraine War sanctions on Russia Trump warning to Russia Ukraine Support US foreign policy US Tariffs Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.