📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Latest Telugu News : Donald Trump: అమెరికా వ‌ద్ద పుష్క‌ల‌మైన అణ్వాయుధాలు ఉన్నాయి: డోనాల్డ్ ట్రంప్‌

Author Icon By Sudha
Updated: November 4, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అణ్వాయుధ ప‌రీక్షలు చేప‌ట్టేందుకు జారీ చేసిన ఆదేశాలను అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మ‌రోసారి స‌మ‌ర్థించుకున్నారు. అమెరికా వ‌ద్ద పుష్క‌ల‌మైన అణ్వాయుధాలు ఉన్నాయ‌ని, ఈ ప్ర‌పంచాన్ని 150 సార్లు పేల్చేంత‌గా ఆయుధాలు ఉన్న‌ట్లు ఆయ‌న అన్నారు. అయితే వాటిని యాక్టివ్ ట్ర‌య‌ల్స్ ద్వారా మెంటేన్ చేయాల్సి ఉంద‌న్నారు. సీబీఎస్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఎందుకు అణ్వాయుధ ప‌రీక్ష‌ల‌కు ఆదేశాలు జారీ చేశార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ట్రంప్ (Donald Trump) ఈ ర‌కంగా బ‌దులిచ్చారు. ఆ అణ్వాయుధాలు ఎలా ప‌నిచేస్తున్నాయో తెలుసుకోవాల‌ని, ఇత‌ర దేశాల త‌ర‌హాలో తాము కూడా న్యూక్లియ‌ర్ వెప‌న్స్ ప‌రీక్షిస్తామ‌ని, ప్ర‌స్తుతం తాము మాత్ర‌మే టెస్ట్ చేయ‌డం లేద‌ని, ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌ని దేశాల‌ జాబితాలో తాము ఉండ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ట్రంప్ అన్నారు. అమెరికా చివ‌రిసారి 1992లో అణ్వాయుధాన్ని ప‌రీక్షించింది. ఒక‌వేళ మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలంటే, వంద‌ల మిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు అవుతుంద‌ని భావిస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాల్లో నిజ‌మైన న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు ఉండ‌వ‌ని ఎన‌ర్జీ మంత్రి క్రిస్ రైట్ క్లారిటీ ఇచ్చారు. వాటిని నాన్ క్రిటిక‌ల్ ప‌రీక్ష‌లుగా పిలుస్తున్న‌ట్లు చెప్పారు.

Read Also : http://లండన్‌లో కీలక ఒప్పందం – హిందుజా గ్రూప్‌తో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు

Donald Trump

ర‌ష్యా, చైనా దేశాలు సీక్రెట్‌గా అణు ప‌రీక్ష‌లు చేప‌డుతున్న‌ట్లు ఇటీవ‌ల ఆరోపించిన విష‌యం తెలిసిందే. కానీ ఆ రెండు దేశాలు త‌మ చివ‌రి అణు ప‌రీక్ష‌ల‌ను 1990 ద‌శ‌కంలోనే నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల నిర్వ‌హించిన బుర‌వెస్నిక్ క్రూయిజ్ క్షిప‌ణి, పోసిడాన్ టార్పిడో ప‌రీక్ష‌ల్లో అణ్వాయుధం వాడ‌లేద‌ని క్రెమ్లిన్ ప్ర‌తినిధి దిమిత్ర పీస్కోవ్ తెలిపారు. ఒక‌వేళ ఇత‌ర దేశాలు అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే దాని ఆధారంగా తాము చేప‌డుతామ‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.

డోనాల్డ్ ట్రంప్ ప్రారంభ జీవితం?

డోనాల్డు జాన్ ట్రంపు 1946 జూన్ 14న క్వీన్సు లోని న్యూయార్కు నగర బరోలోని జమైకా హాస్పిటలులో ఫ్రెడు ట్రంపు, మేరీ అన్నే మాక్లియోడు ట్రంపు దంపతులకు నాల్గవ సంతానం. ఆయన జర్మనీ, స్కాటిషు సంతతికి చెందినవాడు. ఆయన తన పెద్ద తోబుట్టువులు మేరియాను, ఫ్రెడు జూనియరు, ఎలిజబెతు ఆయన తమ్ముడు రాబర్టులతో కలిసి క్వీన్సు‌లోని జమైకా ఎస్టేట్సు పరిసరాల్లోని ఒక భవనంలో పెరిగాడు. ఫ్రెడు ట్రంపు తన పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి $20,000 చెల్లించారు. ఇది 2024లో సంవత్సరానికి $265,000కి సమానం. ట్రంపు ఎనిమిదేళ్ల వయసులో ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేసిన డాలర్లలో లక్షాధికారి.

డోనాల్డ్ ట్రంప్ వ్యాపార రంగం?

ట్రంపు‌ ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించినా ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కాదా అనే అంశం కూడా వివాదాస్పదంగానే ఉంది. 1985 నుంచి 2016 వరకు అమెరికా స్టాకు‌ మార్కెట్టు‌ను, న్యూయార్కు‌లో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంపు‌ ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందని 2016లో ది ఎకనమిస్టు‌ అనే పత్రిక పేర్కొంది. వ్యాపార విజయాల వంటి మెరుపులతో పాటు బ్యాంకులకు అప్పుల ఎగవేతలు వంటి మరకలు కూడా ఉన్నాయని ఆ పత్రిక పేర్కొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

America Breaking News Donald Trump latest news nuclear weapons Politics Telugu News US News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.