అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా(America) ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నది. ప్రపంచ దేశాలపై ఆధిక సుంకాల వసూలు, విదేశీయుల పై కఠిన వీసా విధానాలతో ఉద్యోగులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతున్నది. అంతేకాక ప్రతిపక్షానికి,
అధికారపక్షానికి కుదరని సయోధ్యవల్ల ఏర్పడిన షట్ డౌన్ వల్ల అమెరికా ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైపోతున్నది. కీలకమైన బిల్లుల విషయంలో అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ను ఎదుర్కొంటోంది. 31 రోజులుగా అగ్రదేశ ఆర్థిక వ్యవస్థ మూసివేత కొనసాగుతోంది. దానివల్ల అమెరికా సంపదలో 7 బిలియన్ డాలర్లు (రూ.62,149 కోట్లకుపైగా ఆవిరైంది. ఈ మేరకు కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది.
Read also: ఇందిరమ్మ ఇండ్ల పథకం నిలిచిపోయిందా? లబ్ధిదారుల ఆందోళనలు
17బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
ఈ షట్ డౌన్ వల్ల అమెరికా(Donald Trump) ఆర్థిక వ్యవస్థ నుంచి 7 బిలియన్ డాలర్ల సంపద శాశ్వతంగా ఆవిరైంది. ఇది ఇంకా కొనసాగితే.. ఆరు వారాలకు 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థికనష్టం ఏర్పడుతుంది అని బడ్జెట్ ఆఫీస్ అంచనాలు విడుదల చేసింది. ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ చిన్నగా మొదలై ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని కేపీఎంజీ సంస్థలని చీఫ్ ఎకానమిస్ట్ డయాన్ స్వాంక్ ఆందోళన వ్యక్తం చేశారు.
బాజ్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం
ఇప్పటికే బలహీనం ఉన్న జాబ్ మార్కెట్ పై ఈ ప్రభావం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఆర్తిక, విధానపరమైన ఆనిశ్చితి కారణంగా పలు సంస్థలు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని కృణిరతిమమేధ, ఆటోమేషన్ ను పరీక్షిస్తున్నాయి. ఇవన్నీ ఉద్యోగాలకు కోత పెడుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ మూసివేత వల్ల వెంటనే ఆర్థిక ప్రభావం పడకపోయినా దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఆర్థిక వృద్ధి మందగిస్తుందని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: