📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Donald Trump: పాకిస్తాన్ చమురు భారత్‌కు అమ్మకంపై ట్రంప్ ప్రకటన

Author Icon By Anusha
Updated: July 31, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కలకలం రేపుతున్నాయి.అంతటితో ఆగకుండా, భవిష్యత్తులో పాకిస్థాన్ నేరుగా భారత్‌కు చమురు విక్రయించవచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయ,వాణిజ్య వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.అమెరికా,పాకిస్థాన్ మధ్య కొత్తగా కుదిరిన వాణిజ్య ఒప్పందం (Trade agreement) చమురు రంగంలో పెద్ద మార్పులకు దారితీయవచ్చని అంచనా. పాకిస్థాన్‌లో ఉన్న భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి యునైటెడ్ స్టేట్స్, పాకిస్థాన్ కలిసి పనిచేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ భాగస్వామ్యం కోసం ఒక మంచి చమురు సంస్థను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఈ అభివృద్ధి ప్రాజెక్ట్ విజయవంతమైతే, పాకిస్థాన్ నుంచి నేరుగా భారత్‌కు చమురు సరఫరా చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.

భవిష్యత్తులో

తన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్టు పెడుతూ, అందులో పాకిస్థాన్ వద్ద ఉన్న భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి యునైటెడ్ స్టేట్స్, పాకిస్థాన్ కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం కోసం ఒక మంచి చమురు సంస్థను ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతోందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో పాకిస్థాన్ భారత్‌కు చమురు విక్రయించే అవకాశం కూడా ఉందని ట్రంప్ (Donald Trump) సంకేతాలు ఇచ్చారు. అలాగే అనేక దేశాలతో తమకు వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయని, ఈ దేశాలన్నీ యునైటెడ్ స్టేట్స్‌ను అత్యంత సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాయని చెప్పారు.

Donald Trump: పాకిస్తాన్ చమురు భారత్‌కు అమ్మకంపై ట్రంప్ ప్రకటన

మిత్ర దేశమే

అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి సుంకాల తగ్గింపు కోసం ఆఫర్లు కూడా ఇస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంతటితో ఆగకుండా అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఈ సందర్భంగానే అది మిత్ర దేశమే అయినప్పటికీ, 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈక్రమంలోనే రష్యా నుంచి భారీగా సైనిక ఉత్పత్తులు, చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రష్యాతో వాణిజ్యం కారణంగా 25 శాతం సుంకాలతో పాటు పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్రంప్ విద్యార్హతలు ఏమిటి?

ట్రంప్ పెన్సిల్వేనియా యూనివర్శిటీలోని వాటన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ నుండి ఎకనామిక్స్‌లో డిగ్రీ పొందారు.

ట్రంప్ వ్యాపార రంగంలో ఏం చేశారు?

ట్రంప్ రియల్ ఎస్టేట్, హోటల్స్,గోల్ఫ్ కోర్సులు, టెలివిజన్ షోలు వంటి అనేక రంగాల్లో వ్యాపారాలు నిర్వహించారు. ఆయన “ది అప్రెంటిస్” అనే టీవీ షో ద్వారా కూడా ప్రసిద్ధి చెందారు.

Read hindi news : hindi.vaartha.com

Read Also: Crime: సింగపూర్‌లో బాలికపై లైంగిక దాడి.. భారత సంతతి కి చెందిన వ్యక్తికి జైలు శిక్ష

Breaking News Donald Trump latest news latest news Pakistan India oil sale possibility Pakistan oil reserves Telugu News US Pakistan trade deal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.