📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Donald Trump: పుతిన్ నివాసంపై దాడి మండిపడ్డ ట్రంప్

Author Icon By Saritha
Updated: December 30, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) నివాసంపై జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ల దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (Donald Trump) యుద్ధ పరిస్థితుల్లో దాడులు చేయడం సహజమే కానీ.. నేరుగా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యలకు ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించారు. సోమవారం ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ డ్రోన్ల సమూహం తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని ట్రంప్ వెల్లడించారు. ఈ దాడి వార్త అబద్ధం అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వేరని, కానీ ఏకంగా నివాసంపై దాడి చేయడం సరికాదని, ఇలాంటి పనులు చేయడానికి ఇది సరైన సమయం కాదని ట్రంప్ పేర్కొన్నారు.

Read Also: Bangladesh: కొడుకు స్వదేశానికి వచ్చిన కొన్ని రోజులకే ఖలీదా జియా మృతి

రష్యా ఆరోపణలను తిప్పికొట్టిన ఉక్రెయిన్

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి తెగబడిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ ఆరోపించారు. (Donald Trump) మాస్కో సమీపంలోని నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ నెల 28, 29వ తేదీల్లో ఉక్రెయిన్ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని పేర్కొన్నారు. ఈ ఘటనను దేశ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే రష్యా సైన్యం టార్గెట్‌ను ఎంచుకున్నదని తెలిపారు. కాగా, రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. పుతిన్ నివాసంపై దాడి చేశామన్న రష్యా వాదనలో నిజం లేదని స్పష్టం చేసింది.

ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, పుతిన్‌తో తన సంభాషణ సానుకూలంగా సాగిందని ట్రంప్ చెప్పారు. 24 గంటల వ్యవధిలోనే పుతిన్‌తో ఆయన రెండుసార్లు మాట్లాడారు. కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తే శాంతి నెలకొంటుందని ట్రంప్ వ్యక్తం చేశారు. ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ సమావేశమైన ట్రంప్ యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి తాము చాలా సమీపంలో ఉన్నామని పేర్కొనడం గమనార్హం. కాగా, ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా ప్రాంతంపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించాలని పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Donald Trump Drone attack Latest News in Telugu Putin Residence Russia Ukraine War Telugu News Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.