हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Donald Trump – బగ్రాం ఎయిర్‌బేస్‌ను తిరిగివ్వాలని ఆఫ్ఘ‌న్‌కు ట్రంప్ హెచ్చరిక

Anusha
Latest News: Donald Trump – బగ్రాం ఎయిర్‌బేస్‌ను తిరిగివ్వాలని ఆఫ్ఘ‌న్‌కు ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆఫ్ఘనిస్తాన్‌లోని అత్యంత కీలకమైన సైనిక స్థావరమైన బగ్రామ్ ఎయిర్‌బేస్ను తిరిగి తమకు అప్పగించాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు ప్రపంచ రాజకీయ వర్గాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆయన ప్రకటన ప్రకారం, బగ్రామ్ ఎయిర్‌బేస్ తిరిగి అప్పగించకపోతే ఆ పరిస్థితికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని స్పష్టం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలపై అఫ్గాన్ ప్రభుత్వం (Afghanistan Govt) కూడా అంతే దీటుగా స్పందించింది. దీంతో ఒకప్పుడు అమెరికాకు ప్రధాన సైనిక స్థావరంగా ఉన్న ఈ ఎయిర్‌బేస్‌పై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.త‌న‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు. “బగ్రాం ఎయిర్‌బేస్‌ (Bagram airbase) ను నిర్మించిన అమెరికాకు ఆఫ్ఘ‌నిస్థాన్‌ తిరిగి అప్పగించకపోతే, తీవ్ర‌ పరిణామాలు చోటుచేసుకుంటాయి” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

విదేశీ సైనిక ఉనికిని ఎప్పటికీ అంగీకరించబోమని

ఈ స్థావరాన్ని తిరిగి పొందేందుకు ఇప్పటికే ఆఫ్ఘ‌న్‌తో చర్చలు జరుపుతున్నామని ఆయన శుక్రవారం విలేకరులకు తెలిపారు.ట్రంప్ వ్యాఖ్యలను ఆఫ్ఘ‌నిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో విదేశీ సైనిక ఉనికిని ఎప్పటికీ అంగీకరించబోమని తాలిబన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు శనివారం ఆఫ్ఘ‌న్‌ విదేశాంగ శాఖ సీనియర్ దౌత్యవేత్త జలాలీ (Jalali) చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో అండ్ టెలివిజన్ ఆఫ్ ఆఫ్ఘ‌నిస్థాన్ (ఆర్‌టీఏ) ప్రసారం చేసింది.

Donald Trump
Donald Trump

ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా అమెరికాతో

“చరిత్రలో ఎన్నడూ ఆఫ్ఘ‌న్లు తమ భూమిపై విదేశీ సైనిక ఉనికిని అంగీకరించలేదు. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా అమెరికాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలు కొనసాగించాలి” అని జలాలీ పేర్కొన్నట్లు మీడియా తెలిపింది.కాబూల్‌ (Kabul) కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బగ్రాం ఎయిర్‌బేస్, 20 ఏళ్ల పాటు ఆఫ్ఘ‌న్‌లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు ప్రధాన సైనిక స్థావరంగా పనిచేసింది.

2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఇది అమెరికాకు కీలక కార్యకలాపాల కేంద్రంగా ఉండేది. 2021 ఆగస్టులో అమెరికా దళాలు వైదొలగిన తర్వాత ఈ స్థావరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఈ స్థావరాన్ని వదులుకోవడంపై ట్రంప్ మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-bangladesh-off-to-a-good-start-in-super-4-stage/international/551368/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870