📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Donald Trump – ట్రంప్ సుంకాలతో అమెరికా కంపెనీలకు డామేజ్

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏ ముహూర్తాన ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో తెలియదు కానీ, ఆయన వచ్చినప్పటి నుంచి ప్రజలకు నెమ్మది ఉండడం లేదు. తన అనుచిత నిర్ణయాలతో ప్రజలను,దేశాలను ముప్పుతిప్పలకు గురిచేస్తున్నారు. కోర్టులు కూడా ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం విశేషం. ఇక టారిఫ్ లతో, ప్రపంచ దేశాలతో ట్రెడ్ వార్కుతెరతీసారు. దాదాపు అన్ని దేశాలపై టారిఫ్ ల కొరడా ఝళిపించారు.

భారత్, చైనా దేశాలపై ఏకంగా 50శాతం సుంకాలతో తన కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థికంగా మేలు జరుగుతుందని, ఖజానా నిండుతుందని భావించిన డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో చాలా కంపెనీలు చైనా నుంచి కార్యకలాపాలునిర్వహిస్తుండడంతో యుఎస్ కె భారీ నష్టాన్ని తీసుకొస్తున్నది. బీజింగ్ పై ట్రంప్ (Donald Trump) అధిక సుంకాలను విధించారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అధిక సుంకాలు విధించారు.దీంతో అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోతున్నాయని షాంఘైలోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది.

సర్వేలో విస్తూపోయే విషయాలు

మొత్తం 254లో మూడోవంతు కంపెనీలపై అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వమించిన సర్వే నిర్వహించింది. వీటిల్లో దాదాపు అన్నీ చైనా (China) విధించిన కొత్త టారిఫ్ లవల్లతమ ఆదాయం తగ్గుతోందని చెప్పాయి. బ్యాంకింగ్, కొన్నిరకాల ఇతర పరిశ్రమలు అమెరికాకు ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు చేయడం లేదు. వీటిపై టారిఫ్ భారంఉండదు. అయినా కూడా మిగతా కంపెనీలపై పడుతున్న భారం అమెరికాకు నష్టాన్నే మిగులుస్తున్నాయి.

Latest News

యూరోపియన్ యూనియన్ నేతలకు ఆర్డర్లు వేస్తున్నారు

తమదేశం టారిఫ్ ల విషయంలో భారత్, చైనాలతో చర్చలు జరుపుతుంది. అని చెబుతున్నారు. వాటిని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ పక్క నుంచియూరోపియన్ యూనియన్ ను మాత్రం ఎగదోస్తున్నారు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు చైనా, భారత్ లతో 100శాతం సుంకాలను విధించండి అంటూ యూరోపియన్ యూనియన్ (European Union) నేతలకు ఆర్డర్లు వేస్తున్నారు. ఈ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామని చెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరుతున్నారు. మే,నెల నుంచి చైనా, అమెరికాల మధ్య టారిఫ్ లపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రజలు తీవ్ర అసంతృప్తితో జీవిస్తున్నారు

అయితే ఇవి ఇప్పటివరకు ఒక కొలిక్కి మాత్రం రాలేదు. ఈ లోపు కంపెనీలు మాత్రం
నలిగిపోతున్నాయి. దీనివల్ల భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన కంపెనీలకు ఈ అనిశ్చితి ఒక సవాలుగా మారిందని షాంఘై ఛాంబర్ లీడర్ జెంగ్ పేర్కొన్నారు.ఇప్పటికే అమెరికాలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో జీవిస్తున్నారు.

ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు అధిక ధరలతో వారి జీవనవిధానం భారంగా మారింది. ఇకవిదేశీయులకు ఎలాంటి భరోసా ఉండడం లేదు. తమను ఎప్పుడు దేశం నుంచి విడిచివెళ్లమని ఆదేశిస్తారో, తమ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని,అయోమయస్థితిలో ఉన్నారు. దీంతో పలు కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేకపోతున్నాయి.

ఆయన ఏ పార్టీకి చెందినవారు?

ట్రంప్ అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకుడు.

Read Also:

https://vaartha.com/latest-news-asia-cup-2025-asia-cup-2025-cricket-tournament-begins/international/544245/

Breaking News controversial decisions court rulings Donald Trump economic policies global tariffs International Relations latest news Telugu News trade wars us president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.