📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: ట్రంప్ షాక్.. ఆరువేలకు పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 1:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రంప్ ఏది చేసినా ఓ సంచలమే అవుతున్నది. రెండవసారి అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. వలసవాదులపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ సర్కార్ మరోసారి విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా ప్రభుత్వం (US government) 6వేలమందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీసాల రద్దు వెనుక ఉన్న కారణాలు

ఈ వీసాల రద్దు వెనుక ఉన్న ప్రధాన కారణాలను అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దాదాపు 4వేల వీసాలను విద్యార్థులు అమెరికా చట్టాలను (American laws) ఉల్లంఘించారన్న కారణంతో రద్దు చేశారు. ఈ నేరాల్లో ఎక్కువగా దాడులు, డ్రక్ అండ్ డ్రైవ్, దొంగతనం వంటి చిన్నచిన్న నేరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో రెండు నుంచిమూడువందల వీసాలను టెర్రరిస్ట్ గ్రూపులకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో రద్దు చేశారు. అయితే, ఏ గ్రూపులకు మద్దతు ఇచ్చారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Donald Trump

అంతర్జాతీయ విద్యార్థులపై కఠినమైన నిఘా

కాగా అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై కటినమైన నిఘా ఉంచడానికి, వీసాలను పటిష్టంగా పరిశీలించడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం
తీసుకుంది. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం, పూర్తిస్థాయి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయడం వంటి చర్యలు ఈ విధానంలో భాగం. ఈ కఠిన నిబంధనల వల్ల
ఎంతోమంది విద్యార్థులు, ముఖ్యంగా పాలస్తీనా హక్కులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.

ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికా విశ్వవిద్యాలయాలు

కాగా ట్రంప్ వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపుతూ, కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్నిచూపుతున్నది. ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి కారణాలు చూపకుండా, చిన్నపాటి తప్పులకు కూడా వీసాలు రద్దు చేయడంసరికాదని యూనివర్సిటీలు అంటున్నాయి. ఈ నిర్ణయాలు అమెరికాలో విద్యాభ్యాసం పట్ల అంతర్జాతీయ విద్యార్థులకున్న ఆసక్తిని తగ్గిస్తాయని, అమెరికా ప్రతిష్టకు భంగంకలిగిస్తాయని విద్యాసంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కష్టపడి చదివి, డాలర్లను సంపాదించాలనే ఆశతో శ్రమిస్తున్న విద్యార్థులకు ట్రంప్ విధానాలు కొరగాని కొయ్యగా మారాయి.

ఆయన పుట్టిన తేదీ ఏమిటి?

డొనాల్డ్ ట్రంప్ 14 జూన్ 1946న న్యూయార్క్ సిటీలో జన్మించారు.

రాజకీయాల్లోకి రాకముందు ట్రంప్ ఏం చేశారు?

ట్రంప్ తన కుటుంబ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించి, Trump Organization అనే పెద్ద కంపెనీని నడిపారు. అదేవిధంగా The Apprentice అనే రియాలిటీ టీవీ షో ద్వారా ప్రసిద్ధి చెందారు.

    Read hindi news: hindi.vaartha.com

    Read also:

    https://vaartha.com/congo-massacre-52-people-killed/international/532565/

    Breaking News Donald Trump Foreign students Immigration Policies Indian students latest news student visa cancellation Telugu News US government us president

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.