📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: వలసలపై మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్

Author Icon By Anusha
Updated: July 26, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం వచ్చిన ప్రతిసారీ వలసపై తనదైన శైలిలో విమర్శిస్తుంటారు. తాజాగా ట్రంప్ వలసలపై యూరపు ను హెచ్చరించారు. ట్రంప్ యూరప్ పర్యటనలో భాగంగా శనివారం స్కాట్లాండ్ చేరుకున్న ఆయన విమానం దిగిన తరువాత మీడియాతో మాట్లాడారు. వలసల ప్రవాహం యూరప్ (Europe) నాశనం చేస్తోందని హెచ్చరించారు.వ్యవస్థను సరిచేసుకోకపోతే ఇక యూరప్ మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు.’వలసల విషయంలో మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే యూరప్ మీ చేతుల్లో ఉండదు. మీ వ్యవస్థను కట్టుదిట్టంగా నడిపించండి. లేదంటే మీరుయూరప్ ను కోల్పోతారు’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

వలసల ప్రవాహాన్ని ఆపాలి: ట్రంప్

‘యూరప్, ముఖ్యంగా చాలా దేశాల్లో జరుగుతున్న ఈ భయంకరమైన దండయాత్రను (వలసల ప్రవాహాన్ని) మీరు వెంటనే ఆపాలి’ అని ట్రంప్,సూచించారు. యుఎన్ఒ (ఐక్యరాజ్యసమితి) 2020 అంచనాల ప్రకారం, దాదాపు 87మిలియన్ల వలసదారులు యూరప్ లో నివసిస్తున్నారు అని తెలిపింది.

వలసలపై ట్రంప్ కఠిన చర్యలు

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కఠినమైన వలస వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద వలసదారుల బహిష్కరణ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. అన్నట్లుగా ట్రంప్ ఆచరించి చూసిస్తున్నారు. ఇప్పటివరకువేలాదిమందిని బహిష్కరించారు. ట్రంప్ (Donald Trump) విధానాలపట్ల అమెరికాలో విస్తృత నిరసనలకు దిగారు అక్కడి ప్రజలు. హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ఫండ్స్ నుతగ్గించడమేకాక ఇక విదేశీయులు ఇందులో చదవకుండా నిషేధాన్ని విధించారు. దీంతో విద్యార్థులు కోర్టులను ఆశ్రయించారు. అమెరికాకు వ్యతిరేకంగాఎవరు మాట్లాడినా, సోషల్మీడియా పోస్టు చేసినా వారిపై అక్కడి అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నపలంగా అమెరికాను విడిచివెళ్లాలని హుకుం జారీ చేశారు.

యూరప్ పర్యటనలో ట్రంప్

యూరప్ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డర్ లేయన్తో సమావేశాలుహించనున్నారు ట్రంప్. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో కీర్స్టార్మ్ర్తో జరిగే సమావేశం వేడుకగా ఉంటుందని ఆయన అన్నారు.వీకెండ్లో స్కాట్లాండ్ (Scotland) పశ్చిమతీరంలో ఉన్న తన టర్బెర్రీలో ట్రంప్ బస చేస్తారు. సోమవారం అబెర్డీన్ ని గోల్ఫ్ ప్రాపర్టీకి వెళతారు. అక్కడ తన తల్లి
గౌరవార్థం పెట్టిన రెండో గోల్ఫ్ కోర్సు ను ప్రారంభిస్తారని సమాచారం. ఆమె అమెరికాకు వలస వెళ్లేముందు స్కాటిష్ ద్వీపంలో పుట్టి పెరిగారు.

డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు జన్మించారు?

డొనాల్డ్ ట్రంప్ జూన్ 14, 1946న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించారు.

ట్రంప్ రాజకీయ జీవితం ఎప్పుడు మొదలైంది?

ట్రంప్ 2015లో అధికారికంగా అధ్యక్ష పదవికి పోటీచేస్తానని ప్రకటించారు. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి, విజయం సాధించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Terrorism: టిఆర్ఎఫ్ ను ఉగ్రసంస్థగా ప్రకటించడంలో మాకు అభ్యంతరం లేదు: పాకిస్థాన్

anti-immigration stance Donald Trump Europe crisis Europe warning immigration flow immigration policy media interaction system failure Telugu News Trump Scotland visit us president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.