📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: భారత్ పై సుంకాల బెదిరింపులు.. తగ్గేదే లేదంటున్న ట్రంప్

Author Icon By Anusha
Updated: August 7, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రపంచ దేశాలపై తన ఉక్కుపాదాన్ని మోపడం మాత్రమే కాక తన ఆధిపత్యాన్ని చూపించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధిక సంకాలను విధించడం, మాట వినకపోతే సుంకాలతోబెదిరించడం, కఠిన వీసా నిబంధనలు పెట్టడం వంటి పలు అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇండియా, పాక్ కాల్పుల విరమణకు,ట్రంప్ (Donald Trump) పెంపుకు లింక్ ఉందంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై చేసిన విమర్శలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. 50శాతం టారిఫ్ ను కూడా విధిస్తామని ప్రకటించాడు ట్రంప్.

దీనికి కారణం భారత్

రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొంటుదని. పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్లు అని ట్రంప్ భారత్ పై ఆరోపణలుచేస్తున్నారు.ఇండియా, పాక్ కాల్పుల విరమణలో ట్రంప్ కు క్రెడిట్ ఇవ్వలేదనే భారత్ పై ట్రంప్ కక్ష్య పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్,ఇటీవల కాలంలో రష్యా-ఉక్రెయిన్ లమధ్య కాల్పుల విరమణ విషయంలో,

భారత్ పై కక్ష్య పెంచుకుంటున్న ట్రంప్

తను మధ్యవర్తిత్వం వహించానని, ఆ క్రెడిట్ తమకు దక్కడం,లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకలిగించాయి. ఈ నేపధ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలోకూడా తన ప్రమేయం ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో మూడో పార్టీ ప్రమేయం లేదని, అది కేవలం ఇరుదేశాల చర్చలు ఫలితమేననిభారత విదేశాంగ శాఖ (Department of Foreign Affairs) స్పష్టం చేసింది. అయితే, ట్రంప్ తన వ్యాఖ్యలను పదేపదే పునరుద్ఘాటించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తనపాధాన్యతను చాటుకోవాలని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాణిజ్య సంబంధాలపై ప్రభావం

ఇటీవల కాలంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా ట్రంప్ భారత్ పై సుంకాలు విధించడం, దీనిపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించడం వంటి చర్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులుపేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ తన సార్వభౌమ అధికారాన్ని సమర్థించుకుంది. అమెరికాలోని,పలువురు రాజకీయ నేతలు కూడా ట్రంప్ చర్యలను విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలు భారతదేశంతో వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీస్తాయని రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ వంటివారు హెచ్చరించారు.

ట్రంప్ ఏ పార్టీకి చెందినవారు?

డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవారు.

ట్రంప్ ఎప్పుడు జన్మించారు?

డొనాల్డ్ జాన్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్ నగరంలో జన్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/breaking-news-ghana-helicopter-crashes-8-people-including-two-ministers-die/international/527295/

Donald Trump india usa trade International Politics Telugu News trump foreign policy Trump India Relations Trump tariffs usa president Visa Rules world politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.