ఏ ముహూర్తాన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకారం చేశారో.. ప్రపంచదేశాలకు చుక్కల్ని చూపిస్తున్నారు. విపరీతమైన సుంకాలను పెంచి, ప్రపంచ ట్రేడ్ వారికి ద్వారాలు తెరిచారు. ఇక,అక్రమవలసదారులపై ఉక్కుపాదాన్ని మోపారు. బలవంతంగా వారిని వారివారి దేశాలకు పంపించారు. వీసాల్లో కఠిన నిబంధనల్ని పెట్టి, విదేశీయుల రాకను అడ్డుకుంటున్నారు.
తాజాగా అమెరికా ఉద్యోగం చేయాలంటే,రూ.88లక్షలు చెల్లించాల్సిందే. సెప్టెంబరు 21 నుంచి అమెరికాలో పనిచేయడానికి అవసరమైన హెచ్-1బి వీసా (H-1B visa) కి లక్ష డాలర్ల (రూ.88లక్షలు) రుసుము చెల్లించాల్సి ఉంటుందని కొత్త ఆదేశంపై ట్రంప్ సంతకం చేశారు.ఈ చర్య ముఖ్యంగా భారతీయులు, చైనీయులు ఎక్కువగా ఆధారపడే టెక్ రంగానికి గట్టి దెబ్బ తగలబోతోందని నిపుణులు చెబుతున్నారు.
నైపుణ్యం గల ఉద్యోగులే కావాలి
దీనిపై ట్రంప్ మాట్లాడుతూ మాకు మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కావాలని, అలాగని అమెరికన్ కార్మికులను భర్తీ చేసేవిధంగా విదేశీయులు రావడానికి మేం అంగీకరించమని చెప్పారు. ఆయన దృష్టిలో హెచ్-1బి,వీసా వ్యవస్థను అనేక కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి. అందుకే రుసుమును ఇంతభారీగా పెంచినట్లు వైట్ హౌస్ అధికారులు (White House officials) వెల్లడించారు.
అయితే ఇది ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి వర్తించదని తెలుస్తోంది. కొత్తగా హెచ్-1బి వీసా అప్లై చేసేవాళ్లకు మాత్రమేనని తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. హెచ్-1బి వీసా అనేది మూడేళ్ల వ్యాలిడితో వస్తుంది కాబట్టి ట్రంప్ ఆదేశాల ప్రకారం,చూసుకున్నట్లయితే మూడేళ్లకొకసారి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
హెచ్ -1బి అంటే ఏమిటి?
హెచ్-1బి అనేది అమెరికా తాత్కాలిక వర్క్ వీసా. 1990లో దీనిని ప్రారంభించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం వంటి రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా కంపెనీలు,నియమించుకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీసా మూడు సంవత్సరాల పాటు మంజూరు అవుతుంది. తర్వాత ఆరు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. గ్రీన్ కార్డ్ (Green card) పొందితే శాశ్వతంగా పునరుద్ధరించుకోవచ్చు.
హెచ్-1బిలో 70శాతంపైగా భారతీయులే
ప్రతి సంవత్సరం ఇచ్చే 70శాతంపైగా భారతీయులే వీసాలలో 70శాతం పైగా భారతీయులే పొందుతున్నారు. చైనా రెండో స్థానంలో ఉంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు వవేలాది మంది భారతీయులను,ఈ వీసాల ద్వారా నియమిచుకుంటున్నాయి. కొత్త ఫీజు నియమం అమల్లోకి వస్తే, ప్రతిసారి రెన్యువల్ చేసుకునే సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పటికే గ్రీన్కార్డ్ కోసం భారతయులు సంవత్సరాల,తరబడి ఎదురుచూస్తున్నారు.
వీసాలకే కాకుండా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారికి కూడా కఠిన పరీక్షను మళ్లీ ప్రవేశపెట్టనున్నారు ట్రంప్. 2020లో దీనిని అమలు చేయకుండా బైడెన్ తొలగించారు.ఇప్పుడు మళ్లీ దీన్ని ట్రంప్ తీసుకువస్తున్నారు. దరఖాస్తుదారులు అమెరికా చరిత్ర, రాజకీయం మీద 128 ప్రశ్నలు చదవాలి. వాటిలో 20 ప్రశ్నలు అడుగుతారు. 12కి సరైన సమాధానంచెప్పాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: