📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump:భారత్​-పాక్ యుద్ధాన్నివాణిజ్యంతో ఆపా: డొనాల్డ్ ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: October 7, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నవ్వుపోదురు నాకేంటి అంటూ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణలో తనపాత్రపై గొప్పగా చెప్పుకుంటున్నారు. తాజాగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మరోసారి వ్యాఖ్యలు చేశారు. అది కూడా వాణిజ్య ఒప్పందంతో ముగించినట్లు పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదంటూ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొన్నప్పటికీ ట్రంప్ మాత్రం తనదే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

AI రాకతో టాప్ కంపెనీలలో సగం మూతపడే అవకాశం

War:భారత్​-పాక్ యుద్ధాన్నివాణిజ్యంతో ఆపా : డొనాల్డ్ ట్రంప్

శక్తివంతమైన దేశంగా అయ్యాం: ట్రంప్

‘మేం మళ్లీ ధనిక, శక్తివంతమైన దేశంగా అయ్యాం. నేను ఏడు యుద్ధాలను ముగించా. అందులో కనీసం సగం నా వాణిజ్య సామర్థ్యం, టారిఫ్‌ల శక్తితో సాధ్యమైంది. టారిఫ్‌లే లేకపోతే, కనీసం ఆ ఏడు యుద్ధాల్లో నలుగైనా ఇంకా కొనసాగేవి. భారత్, పాకిస్థాన్‌ (Pakistan) నే చూసే అర్ధమవుతుంది. ఇరుదేశాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఏడు విమానాలు కూలిపోయాయి. నేను ఏమని అన్నానో చెప్పదలుచుకోను. కానీ నా మాటలు చాలా ప్రభావవంతంగా పనిచేశాయి. మేం వందల బిలియన్ల డాలర్లను సంపాదించడమే కాకుండా, టారిఫ్‌ల వల్ల ప్రపంచానికి శాంతి తీసుకువచ్చాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు ఏడు యుద్ధాలను ముగించినందుకు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాంటించారు. ‘మేం శాంతి ఒప్పందాలు రూపొందిస్తున్నాం. యుద్ధాలను ఆపుతున్నాం. భారత్-పాకిస్థాన్, థాయిలాండ్–కాంబోడియా మధ్య యుద్ధాలను మేమే ఆపాం. భారత్, పాకిస్థాన్ వాణిజ్య ద్వారానే యుద్ధాన్ని ఆపా. ఇరువురి నాయకుల పట్ల నాకు గౌరవం ఉంది. కానీ మేం ఆపిన అన్ని యుద్ధాలను చూసినప్పుడు అది స్పష్టమవుతుంది.

ట్రంప్ వాదనను త్రోసిపుచ్చిన భారత్​

అయితే ట్రంప్ వాదనను భారత్​ ఎప్పుడో తోసిపుచ్చింది. ఇరుదేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో పక్షం ప్రమేయం లేదని తేల్చిచెప్పింది. ఇరుదేశాలకు చెందిన సైన్యాల డైరెక్టర్​ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్​ మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాత, పాకిస్థాన్​తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరందని స్పష్టం చేసింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మారడం లేదు. మరోవైపు ఇన్నాళ్లు సైలెంట్​గా ఉన్న పాక్ ఇటీవలే కొత్త రాగం అందుకుంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఆగడానికి ట్రంప్ కృషి చేశారని ప్రకటించింది.

గాజా వివాదాన్ని ముగించి శాంతి

భారత్​-అమెరికా మధ్య సుంకాల రగడ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజా వివాదం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రజలకే కాకుండా మొత్తం పశ్చిమాసియా ప్రాంతానికే దీర్ఘకాలిక శాంతి, భద్రత, అభివృద్ధిని సాధించడానికి ఉపయోగిపడుతుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

నిజంగా డొనాల్డ్ ట్రంప్ భారత్​-పాక్ యుద్ధాన్ని ఆపినట్లుగా మీరు భావిస్తున్నారా?

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Donald Trump India Pakistan Relations india pakistan war International Relations peace through trade Telugu News trade diplomacy Trump on South Asia US foreign policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.