అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్స్కీ తలచుకుంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం వెంటనే ఆపగలరు, యుద్ధం ఆగడం లేదా కొనసాగడం అనేది జెలెన్స్కీ (Zelensky) నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని’ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ యుద్ధం ఎలా మొదలైందో గుర్తుంచుకోవాలని, ఒబామా కాలంలోనే క్రిమియాను స్వాధీనం చేసుకున్నారని, అప్పుడు ఒక్క తుపాకీ కూడా పేలలేదని ట్రంప్ తన ట్వీట్లో ప్రస్తావించారు. ఈ విదాస్పద ట్రీట్లో ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదని కూడా ట్రంప్ పేర్కొన్నారు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని, ఉక్రెయిన్ నాటోలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన పరోక్షంగా సూచించారు.
ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించిన జెలెన్స్కీ ?
కాగా ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యలు జెలెన్స్కీపై ఒత్తిడి పెంచడానికి, ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War) ముగింపుపై అమెరికా తన వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా ఉందని సూచిస్తున్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. రష్యాతో శాంత చర్చలు జరపడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నప్పటికీ, తన భూభాగాన్ని రష్యాకు అప్పగించే ప్రసక్తి లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ట్రంప్తో చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ, యుద్ధాన్ని ముగించేందుకు తమకు పూర్తిహక్కులు ఉన్నాయని, ఇతర దేశాల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు.
మొత్తానికి, ట్రంప్ ట్వీట్ ప్రపంచదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా దాదాపు మూడున్నర సంవత్సరాలుగా రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలాభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. పుతిన్ మాత్రం యుద్ధాన్ని ఆపేందుకు సుముఖంగా లేరు. ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండాల్సింది అని పలు దేశాలు కూడా అభిపాయపడుతున్నాయి. తమ దేశానికి ముప్పువాటిల్లే నిర్ణయాలను తమ పొరుగుదేశాలు తీసుకుంటే తాము దాన్ని వ్యతిరేకిస్తామని, ఆ దేశాలపై యుద్ధం చేయడం తప్ప తమకు మరో మార్గం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. రెండు దేశాలమధ్య యుద్ధంతో ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. చమురు, నిత్యావసర వస్తువుల సరఫరాకూ తీవ్ర అంతరాయం కలుగుతున్నది.
Read hindi news: hindi.vaartha.com
Read also: