పశ్చిమాసియాలో గత కొంతకాలంగా రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న పోరును ముగించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా స్పందించిన ట్రంప్.. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యను క్రమంగా తగ్గించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఇక్కడే ట్రంప్ (Trump) ఒక కీలక మెలిక పెట్టారు. సైనిక చర్య తగ్గిస్తామని చెబుతూనే, ‘కాల్పుల విరమణ’కు (Ceasefire) మాత్రం తాము సిద్ధంగా లేమని స్పష్టం చేయడం గమనార్హం. ఇది అమెరికా తన పట్టును సడలించకుండానే వ్యూహాత్మక మార్పులు చేస్తోందనే సంకేతాన్ని ఇస్తోంది.
Read Also: Donald Trump : ‘పిరికిపందలు’ అంటూ నాటో దేశాలపై ట్రంప్ ఫైర్!
America: ఇరాన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేసాం
ఈ యుద్ధంలో అమెరికా సాధించిన విజయాలను ట్రంప్ సగర్వంగా ప్రకటించారు. ఇరాన్ యొక్క క్షిపణి సామర్థ్యాలను, వైమానిక దళాన్న, నావికా వ్యవస్థలను అమెరికా సైన్యం దాదాపుగా తుడిచిపెట్టేసిందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రధాన లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని, ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీ వైపు అడుగులు వేయకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేశామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ భవిష్యత్తులో మళ్లీ అణ్వాయుధ ప్రయత్నాలు చేస్తే, తమ స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటన ద్వారా ఇరాన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేశామని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాలోని తన మిత్ర దేశాల రక్షణ విషయంలో అమెరికా రాజీపడబోదని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలకు అమెరికా అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తోందని ఆయన గుర్తుచేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :