ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అయ్యాక, ఆయనలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. వలసవాదులపై తన ఉక్కుపాదాన్ని మోపి,కఠిన చర్యలు దిగారు. అధిక సుంకాలను విధిస్తూ, అనేక దేశాలకు పక్కలో బల్లెంగా మారారు. తాను చెప్పిందే వేదం, తన మాటే ఖచ్చితం,అనేలా ప్రవరిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపివేసానని పలుమార్లు చెప్పుకొచ్చారు. దీనికి భారత్ కూడా గట్టి కౌంటరు ఇచ్చింది. అయినా తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో కూడా ట్రంప్ (Donald Trump) అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై ట్రంప్ మండిపడ్డారు. చమురు దిగుమతులను ఆపకపోతే 24 గంటల్లో అదనపు టారీఫ్లు విధాస్తామంటూ బెదిరించారు. అయితే ఈరోజు దాని గురించి అడగ్గా నేనలాచెప్పలేదే అంటూ మాట మార్చారు. టారీఫ్ లు, శాతాలు గురించి నేనేమీ మాట్లాడలేదని ట్రంప్ బుకాయించారు.
దీటుగా జవాబిచ్చిన భారత్
తానెప్పుడు పర్శంటేజ్ల గురించి మాట్లాడలేదని..టారీఫ్లపై ఇంకా కసరత్తులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ట్రంప్. త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బుధవారం రష్యాతో సమావేశం ఉందని.. దాని తరువాత నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు టారీఫ్ (tariff) బెదిరింపులకు భారత్ దీటుగా జవాబిచ్చింది. అమెరికా రష్యాతో చేస్తున్న వ్యాపారాల గురించి,మాట్లాడాలంటూ ప్రశ్నించింంది. ఆ దేశం నుంచి యురేనియం, ఎరువుల దిగుమతి సంగతేటో తేల్చాలని భారత్ అడిగింది. దీనిపై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. రష్యాతో వ్యాపారం గురించి అసలు తనకేమీ తెలియదని చెప్పుకొచ్చారు.
జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యం: భారత్
భారత్ ఎక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి అనేది తమ అంతర్గత వ్యవహారమని.. జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతా,ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ తెలిపింది. దానికోసం అమెరికా భారత్ మీద ఒత్తిడి తేవడం ఎంత మాత్రం,సమంజసం కాదని చెప్పింది. అమెరికా, రష్యాల మధ్య వివాదాంలోకి భారత్ను తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ట్రంప్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు?
ట్రంప్ అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకుడు.
ట్రంప్ వ్యాపార రంగంలో చేసిన పనులు ఏమిటి?
ట్రంప్ “ది ట్రంప్ ఆర్గనైజేషన్” అనే రియల్ ఎస్టేట్ వ్యాపారం, హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు, క్యాసినోలను నిర్వహించారు. “ది అప్రెంటిస్” అనే రియాలిటీ టీవీ షో ద్వారా కూడా ప్రసిద్ధి చెందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: