అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మరోసారి అధికార వర్గాలు డిమాండ్ చేశాయి. తాజాగా థాయ్‌లాండ్–కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ శాంతి ఒప్పందాన్ని వెల్లడించగా, వెంటనే వైట్ హౌస్ (White House) స్పందన వచ్చింది.
ట్రంప్ అర్హుడే – వైట్ హౌస్ స్పష్టం
వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లివెట్ (Caroline Livet) మీడియాతో మాట్లాడుతూ – “ట్రంప్ (Donald Trump) నోబెల్ శాంతి బహుమతికి పూర్తిగా అర్హుడు. ఆయన నాయకత్వం వల్లే అనేక దేశాల్లోని యుద్ధాలు ఆగాయి. నెలకి ఒక యుద్ధాన్ని నిలిపే స్థాయిలో ఆయన చొరవ చూపించారు” అని తెలిపారు. ప్రతిదాడులతో రగిలిపోతున్న దేశాలను శాంతింపజేశారని వివరించారు. ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఫోన్ చేసి యుద్ధం ఆపేయాలని హెచ్చరించారని తెలిపారు.
ప్రపంచ యుద్ధాలను ఆపిన నేతగా ట్రంప్
కరోలిన్ లివెట్ వివరించగా – ఈజిప్ట్-ఇథియోపియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఇండియా-పాకిస్థాన్, రువాండా-కాంగో, సెర్బియా-కొసావో, థాయ్‌లాండ్-కంబోడియా దేశాల మధ్య తీవ్రంగా సాగిన వివాదాలను ట్రంప్ జోక్యం ద్వారా శాంతిపరచగలిగారని చెప్పారు. ఆయా దేశాల నాయకులతో మాట్లాడి వారిని సమర మానాలని ఒప్పించారని తెలిపారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని కరోలిన్ డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: