📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Donald Trump: మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

Author Icon By Saritha
Updated: March 14, 2026 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Donald Trump: భారత్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రేమ కురిపించారు. భారత్, భారత ప్రజల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ తాను మరోసారి భారత్ కు రావాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీపై సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026 సదస్సులో ట్రంప్ పంపిన ఈ సందేశాన్ని అమెరికాకు చెందిన మితవాద కార్యకర్త, ట్రంప్ విధేయురాలు లారా లూమర్ చదివి వినిపించారు. తాను కొద్దిసేపటి క్రితమే ట్రంప్ తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పిన ఆమె సందేశాన్ని చదివారు.

Read Also: North Korea: జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

Donald Trump: Modi is my friend sends a message saying he will visit India soon.

లారా లూమర్ చదివి వినిపించిన ట్రంప్ సందేశం

ఈ సందర్భంగా ట్రంప్ చెప్పిన మాటలను ఆమె యథాతథంగా వివరించారు. “నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. నేను మోదీని (Prime Minister Modi) ఎంతగానో ఇష్టపడతానని దయచేసి వారికి తెలియజేయండి. ప్రధాని మోదీ ఒక అద్భుతమైన నాయకుడు, నా మంచి స్నేహితుడు. దయచేసి భారత ప్రజలకు చెప్పండి.. నాకు మోడీపై కూడా ఎంతో అభిమానముంది. ఆయన గొప్ప నాయకుడు, అలాగే నా మంచి స్నేహితుడు. భారత ప్రజలకు నా ప్రేమను తెలియజేయండి. త్వరలోనే మరోసారి భారత్ కు రావాలని భావిస్తున్నాను” అని ట్రంప్ చెప్పిన సందేశాన్ని లూమర్ వివరించారు.

అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ రాజకీయాలపై చర్చ జరుగుతున్న ఈ సదస్సులో లూమర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ట్రంప్, మోదీ మధ్య ఉన్న బలమైన స్నేహబంధాన్ని ఈ సందేశం మరోసారి స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Donald Trump India Today Conclave 2026 India-US Relations Laura Loomer Narendra Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.