ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump) ఇటీవలి కాలంలో సవాళ్లు ఎదురవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, రష్యా, భారత్ వంటి శక్తివంతమైన దేశాలు వాషింగ్టన్‌ను కేంద్రంగా పెట్టుకున్న నిర్ణయాలకు అంతగా స్పందించకపోవడమే కాకుండా, స్వతంత్రంగా కూటములు నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తన ప్రభావం తగ్గిపోకుండా చూసుకునేందుకు ట్రంప్ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Read Also: Illegal OilTransport: ఒమన్ గల్ఫ్‌లో చమురు నౌకను ఇరాన్ స్వాధీనం
జీ7కి ప్రత్యామ్నాయంగా ‘C5’ ఆలోచనపై చర్చ
ఈ వ్యూహంలో భాగంగా అమెరికా, భారత్, చైనా, రష్యా, జపాన్‌లతో కూడిన ఐదుదేశాల కూటమి—‘సీ5’ (C5) ఏర్పాటు చేయాలన్న ఆలోచన తెరపైకి వచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. యూరప్ ఆధిపత్యంలో నడిచే జీ7 వంటి సంప్రదాయ వేదికలను పక్కన పెట్టి, ప్రపంచంలోని ప్రధాన శక్తులను ఒకే టేబుల్ వద్దకు తీసుకురావడమే ఈ కూటమి లక్ష్యమని ఆ కథనాలు సూచిస్తున్నాయి.
అమెరికా( Donald Trump) ప్రచురణ అయిన పోలిటికో ప్రకారం, ఈ సీ5 ఆలోచన వైట్‌హౌస్ ఇటీవల విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించిన విస్తృతమైన, బహిర్గతం కాని పత్రంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేకపోయామని ఆ కథనం స్పష్టం చేసింది. ఇదే అంశంపై డిఫెన్స్ వన్ కూడా గతంలో నివేదిక వెలువరించింది.
ఈ ప్రతిపాదిత కూటమిలో జనాభా, సైనిక శక్తి, ఆర్థిక బలం ఆధారంగా ప్రపంచ ప్రభావం కలిగిన దేశాలను మాత్రమే చేర్చాలన్న ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. జీ7లాగా సంపన్న ప్రజాస్వామ్య దేశాలనే సభ్యులుగా తీసుకునే నిబంధనలకు ఇది అతీతంగా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రాచ్య భద్రత, ముఖ్యంగా ఇజ్రాయెల్–సౌదీ అరేబియా సంబంధాల సాధారణీకరణ వంటి అంశాలు ఈ కూటమి అజెండాలో కీలకంగా ఉండవచ్చని కూడా నివేదికలు సూచించాయి.
అయితే ఈ వార్తలపై వైట్‌హౌస్ స్పష్టమైన ఖండన చేసింది. అధికార ప్రతినిధి హన్నా కెల్లీ మాట్లాడుతూ, 33 పేజీల అధికారిక జాతీయ భద్రతా వ్యూహానికి ఎలాంటి రహస్య లేదా ప్రత్యామ్నాయ వెర్షన్ లేదని తెలిపారు. అయినప్పటికీ, భద్రతా నిపుణులు మాత్రం సీ5 వంటి ఆలోచన ట్రంప్ రాజకీయ శైలికి అనుగుణంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదే సమయంలో ఈ ప్రతిపాదనపై అమెరికా మిత్రదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యాకు యూరప్ కంటే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పశ్చిమ దేశాల ఐక్యత, నాటో సమన్వయం బలహీనపడే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. మరోవైపు, ప్రపంచం బహుళ ధ్రువ దిశగా మారుతున్న నేపథ్యంలో జీ7, జీ20 వంటి వేదికలు సరిపోవడం లేదని, కొత్త శక్తి సమీకరణలకు అనుగుణంగా సీ5 వంటి ఆలోచనలు అవసరమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :