📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: భారతదేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం.. ట్రంపు మోదీ రిప్లై

Author Icon By Ramya
Updated: August 5, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి పదవిస్వీకారం చేసిన తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైనశైలిలో ముందుకు సాగుతున్నారు. ఎంతమంది ఎన్ని
విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా, తనదేశ పౌరుల క్షేమమే తన విధానమని ఇతర దేశాలపై కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. ఇందులో భాగంగా వీసాలో పలు నిబంధనలతో పాటు విదేశీయుల రాకను పెద్దసంఖ్యలో అడ్డుకుంటున్నారు. ఇక వాణిజ్యపన్నుల విషయంలో ఎలాంటి రాజీలేని విధానాలతో ప్రపంచదేశాల మధ్య ట్రేడ్వారికి ద్వారాలు తీశారు. ఇందులో భాగంగా భారతదేశంపై కూడా ట్రంప్ పలు కఠిన నియమాలను విధిస్తున్నారు. పదేపదే భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపివేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే వీటన్నింటికీ భారత ప్రధాని మోదీ గట్టిగానే సమాధానం చెబుతున్నారు.

Donald Trump

చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలకు భారత్ ఘాటు ప్రతిస్పందన

తాజాగా చమురు విషయంలో ట్రంప్ (Donald Trump) పెట్టిన ఆంక్షలకు మోదీ ప్రభుత్వం (Modi Govt) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారతదేశం ఎక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి అనేది తమ అంతర్గత వ్యవహారమని, జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ తెలిపింది. దానికోసం అమెరికా భారత్ (America India) మీద ఒత్తిడి తేవడం ఎంతమాత్రం సమంజసం కాదని చెప్పింది. అమెరికా, రష్యాల మధ్య వివాదంలోకి భారత్ను తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించి అమెరికానే ఇప్పుడు వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టింది. భారతదేశం 85శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని తెలిపింది.

మాపై మీ ఒత్తిడిని తగ్గించండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా నుంచి చౌకగా లభించే చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. దీంతో రషెష్యా, భారత్ కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింంది. అయితే భారత్ కన్నా యూరప్ దేశాలు రష్యా నుంచి ఇంకా ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాయి. వాటిపై అమెరికా ఏమీ ఒత్తిడి తీసుకురావడం లేదు. కానీ భారత్ చమురు దిగుమతి మీద ఆంక్షలు విధిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంత మంచివి కావని భారతవిదేశాంగ శాఖ హెచ్చరించిందది. యూరప్, రష్యాతో చేస్తున్న వ్యాపారాలను అన్నింటినీ విదేశాంగ శాఖ ఎత్తి చూపించింది.

భారతపై పై ఇప్పటికే 25శాతం సుంకం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే భారత్పై 25శాతం సుంకం, పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో చమురు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. ఆ ఇంధనాన్ని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు పొందుతోందని విమర్శించారు. రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్లో అమాయకుల ప్రాణాలు పోతున్నా వారికి పట్టడం లేదంటూ మండిపడ్డారు. అందుకే భారత్పై మరోసారి భారీగా టారిఫ్లు పెంచుతానని హెచ్చరించారు.

ట్రంప్ చమురు ఆంక్షలకు భారత్ ఎలా స్పందించింది?

భారత ప్రభుత్వం అమెరికా ఆంక్షలకు కౌంటర్‌గా, చమురు దిగుమతులపై నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రత మేరకు నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ ప్రకటించింది.

భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా ఏమన్నది?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ చమురు కొనుగోలు చేసి మార్కెట్లో అధిక ధరకు అమ్ముతోందని విమర్శించారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌పై భారీ టారిఫ్లు పెంచుతానని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/earthquakes-hit-kamchatka-coast-again/international/526072/

Breaking News Donald Trump India US relations latest news Oil Imports Telugu News Trade War US sanctions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.