📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలమధ్య జరిగిన యుద్ధంలో 5 యుద్ధ ఫైటర్ జెట్లు కూలిపోయాయని చెప్పారు.అంతేకాదు ఈ యుద్ధాన్ని తానే ఆపానని, లేకపోతే అణుయుద్ధంగా మారేదేమో అని తన గొప్పలు చెప్పుకొచ్చారు.వైట్ హౌస్ కాంగ్రెస్ (White House Congress) సభ్యులతో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరువురి ప్రధానులతో మాట్లాడాను: ట్రంప్

‘మేం భారత్-పాక్, కాంగో- రువాండా యుద్ధాలను ఆపాం. ప్రత్యేకంగా భారత్, పాక్ ల మధ్య జరిగిన దాడుల్లో ఐదువిమానాలను కూల్చివేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. అప్పుడే నేను ఇరుదేశాల ప్రధానులకు ఫోన్,చేసి వాణిజ్య కార్యకలాపాలు ఉండవని చెప్పా. ఇవి అణ్వాయుధ సామర్థ్యం గల దేశాలు. యుద్ధాన్ని ఆపకపోతే ఎక్కడఆగేదో ఎవరికీ తెలియదు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని అమెరికా (America) పూర్తిగా ధ్వంసం చేసింది. కొసావో, సెర్బియా మధ్య యుద్ధాన్ని కూడా నిలిపివేశాం. ఇంకా కొన్ని దేశాల్లో జరగలేదని’ ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇలా ఏదైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఆ దేశాల పేర్లు కూడా విన్నారో లేదో నాకుఅనుమానం’ అని ట్రంప్ ఎద్దేవా చేశారు.

ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించిన భారత్

ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండానే కాల్పుల విరమణ ఒప్పందంచేసుకున్నట్లు తెలిపింది. తమకు ఇతర దేశాల మధ్యవర్తితంపై ఆధారపడి పని చేయాల్సిన అవసరం లేదని, ఇందులో ట్రంప్ చెప్పుతున్న విషయాలు పూర్తిగా అవాస్తమని భారత్ పేర్కొంది. తమ దేశం ఉగ్రవాదాని (Terrorism) కి వ్యతిరేకంగా పోరాడుతున్నదని, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని దూరం చేసుకోనంత కాలం రెండు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిత ఒప్పందాలు ఉండవని భారత్ చెబుతున్నది. తమ దేశప్రజలు పాక్ ఉగ్రవాద సంస్థలకు బలైతే దాని పరిణామాలుతీవ్రంగా ఉంటాయని మరోసారి భారత్ హెచ్చరించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తామని, ఉగ్రవాదానికివ్యతిరేకపై పోరాడే దేశాలతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని భారత్ చెబుతున్నది.

డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ జన్మించారు?

డొనాల్డ్ ట్రంప్ 14 జూన్ 1946న న్యూయార్క్ నగరంలో జన్మించారు.

ట్రంప్ భార్య ఎవరు?

డొనాల్డ్ ట్రంప్ భార్య పేరు మెలానియా ట్రంప్ (Melania Trump). ఆమె మోడల్‌గా పనిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: India – Pak : భారత్ కంటే సేఫెస్ట్ కంట్రీగా పాకిస్థాన్..?

Breaking News Donald Trump statement fighter jets crash india pakistan war latest news nuclear war prevention Operation Sindhoor Telugu News Trump on India Pakistan White House Congress meeting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.