గాజాలో శాంతిని నెలకొల్పడం కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు.. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం దక్కింది. ఎందుకంటే.. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తిరుగుబాటు సంస్థ తన వద్ద బందీలుగా ఉన్న 20 మంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టింది.ఈ క్రమంలో బందీల విడుదలకు మూల కారణమైన ట్రంప్‌కు (Donald Trump)ఇజ్రాయెల్ పార్లమెంట్ జేజేలు పలికింది. బందీల విడుదల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వెళ్లిన ట్రంప్ ప్రసంగించేందుకు అక్కడి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పార్లమెంటేరియన్‌లు ఆయనకు సాదరస్వాగతం పలికారు. అందరూ లేచి నిలబడి కృతజ్ఞతగా కొన్ని నిమిషాలపాటు చప్పట్లు చరిచారు.
ట్రంప్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రపంచానికి మరింత మంది ట్రంప్‌లు అవసరం అంటూ ఆయనను ఆకాశానికెత్తారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో(Donald Trump).. తన స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్‌కాఫ్, అల్లుడు జేర్డ్ కుష్నర్, కుమార్తె ఇవాంకా ఉన్నారు. కాగా జెరూసలేంలోని ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగం అనంతరం ట్రంప్.. కాల్పులు విరమణ ప్రణాళికను రూపొందించే ప్రక్రియలో పాల్గొనేందుకు ఈజిప్టుకు వెళ్లనున్నారు.
డోనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితం ?
2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ చేతిలో ఓడిపోయిన తర్వాత ట్రంపు ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించాడు. ఇది 2021లో జనవరి 6 కాపిటలు దాడితో ముగిసింది. అధికార దుర్వినియోగం, కాంగ్రెసును అడ్డుకున్నందుకు 2019లో ఆయన మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టబడింది. 2021లో తిరుగుబాటును ప్రేరేపించినందుకు ఆయన మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టబడింది; సెనేటు ఆయనను రెండుసార్లు నిర్దోషిగా ప్రకటించింది.2023లో ట్రంపు సివిలు కేసుల్లో లైంగిక వేధింపులు, పరువు నష్టం కోసం, వ్యాపార మోసం కోసం బాధ్యుడని తేలింది. 2024లో వ్యాపార రికార్డులను తప్పుడుగా చూపించినందుకు ఆయన దోషిగా తేలింది. దీనితో ఆయన నేరానికి పాల్పడిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు.
డోనాల్డ్ ట్రంప్ బాల్యము?
డోనాల్డు జాన్ ట్రంపు 1946 జూన్ 14న క్వీన్సు లోని న్యూయార్కు నగర బరోలోని జమైకా హాస్పిటలులో ఫ్రెడు ట్రంపు, మేరీ అన్నే మాక్లియోడు ట్రంపు దంపతులకు నాల్గవ సంతానం. ఆయన జర్మనీ, స్కాటిషు సంతతికి చెందినవాడు. ఆయన తన పెద్ద తోబుట్టువులు మేరియాను, ఫ్రెడు జూనియరు, ఎలిజబెతు ఆయన తమ్ముడు రాబర్టులతో కలిసి క్వీన్సులోని జమైకా ఎస్టేట్సు పరిసరాల్లోని ఒక భవనంలో పెరిగాడు. ఫ్రెడు ట్రంపు తన పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి $20,000 చెల్లించారు. ఇది 2024లో సంవత్సరానికి $265,000కి సమానం. ట్రంపు ఎనిమిదేళ్ల వయసులో ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేసిన డాలర్లలో లక్షాధికారి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: