📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్‌పై ప‌రువున‌ష్టం దావా వేసిన ట్రంప్‌

Author Icon By Sudha
Updated: July 19, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal – WSJ), దాని పేరెంట్ కంపెనీ డౌ జోన్స్‌ వాటి ఓనర్ రూపర్ట్ మర్డోచ్‌ పై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో ట్రంప్ దాదాపు $10 బిలియన్ పరిహారం డిమాండ్ చేశారు. ఎప్‌స్టిన్‌కు రాసిన లేఖ‌పై వ‌చ్చిన వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నాన్ని ఆయ‌న ఖండించారు. ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయ‌ని, గ‌తంలో ట్రంప్ (Donald Trump)అత‌నికి ఓ వ్యంగ‌భ‌రిత శృంగార లేఖ‌ను రాసిన‌ట్లు ఆ క‌థ‌నంలో ప‌త్రిక పేర్కొన్న‌ది. అయితే ఆ లేఖా క‌థ‌నాన్ని త‌ప్పుప‌ట్టిన ట్రంప్‌..(Donald Trump) ఆ ప‌త్రిక‌పై చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ పేరెంట్ కంపెనీ డౌ జోన్స్‌తో పాటు దాని ఓన‌ర్ రూప‌ర్ట్ ముర్డోక్ పై ప‌రువున‌ష్టం దావా వేశారు.

Donald Trump: వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్‌పై ప‌రువున‌ష్టం దావా వేసిన ట్రంప్‌

10 బిలియ‌న్ డాల‌ర్ల ప‌రువున‌ష్టం

సుమారు 10 బిలియ‌న్ డాల‌ర్ల ప‌రువున‌ష్టం కేసును ట్రంప్ ఫైల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎప్‌స్టీన్ 50వ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ట్రంప్ ఆ లేఖ రాసిన‌ట్లు ఆ క‌థ‌నంలో తెలిపారు. దాంట్లో ట్రంప్ సంత‌కం కూడా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. కానీ ఆ లేఖ అవాస్త‌వ‌మ‌ని ట్రంప్ వెల్ల‌డించారు. ఆ లేఖ‌లో ఉన్న భాష‌, ప‌దాలు తాను వాడేవి కాద‌న్నారు. వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్‌పై కేసు వేస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై అమెరికాలో చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు న‌మోదు అయ్యింది. సెక్స్ క్రైంలో దోషిగా తేలిన అత‌న్ని జైలులో వేశారు. అయితే మ‌న్‌హ‌ట్ట‌న్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న అత‌ను 2019లో ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయాడు. ఎప్‌స్టీన్ కు స‌బంధించిన అన్ని అంశాలు బ‌హిర్గ‌తం చేయాల‌ని ఇటీవ‌ల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వ‌డంతో తాజా వివాదం మ‌ళ్లీ రాజుకున్న‌ది.

డోనాల్డ్ ట్రంప్ ఏ దేశస్థుడు?

డోనాల్డ్ జాన్ ట్రంప్ (జననం జూన్ 14, 1946) ఒక అమెరికన్ వ్యాపారవేత్త, మీడియా వ్యక్తిత్వం మరియు రాజకీయవేత్త, అతను 2025 నుండి యునైటెడ్ స్టేట్స్ యొక్క 47వ అధ్యక్షుడు. గతంలో, 2017 నుండి 2021 వరకు 45వ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను రిపబ్లికన్ పార్టీ సభ్యుడు.

డోనాల్డ్ ట్రంప్ నికర విలువ ఎంత?

అమెరికా రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవేత్త, అమెరికాకు 47వ మరియు అంతకుముందు 45వ అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ నికర విలువ బహిరంగంగా తెలియదు. దశాబ్దాలుగా, ఫోర్బ్స్ అతని సంపదను అంచనా వేసింది, ప్రస్తుతం జూన్ 2025 ప్రారంభంలో $5.1 బిలియన్లుగా అంచనా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Donald Trump: భారత్, పాక్ యుద్దాన్ని ఆపినట్లు మరోసారి ట్రంప్ గొప్పలు

Breaking News Defamation Lawsuit Donald Trump Jeffrey Epstein latest news Rupert Murdoch Telugu News Wall Street Journal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.