అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్, రష్యా (India and Russia) మధ్య వాణిజ్య సంబంధాలపై స్పందించారు. ఈ రెండు దేశాలు తమ మధ్య ఎలా వాణిజ్యం చేసుకున్నా తాను అభ్యంతరపడనని స్పష్టం చేశారు.
“వారు వారి ఆర్థిక వ్యవస్థలకే నష్టం చేసుకుంటున్నారు”
భారత్, రష్యాలు తమ మధ్య వ్యాపార ఒప్పందాలు (Business agreements) చేసుకుంటూ తాము తమ ఆర్థిక వ్యవస్థలను మరింతగా దిగజార్చుకుంటున్నాయని ట్రంప్ (Donald Trump) విమర్శించారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ఆయన, ఇది వారి దేశాల ఆర్థిక స్వతంత్రతకు నష్టం చేసే అంశమని వ్యాఖ్యానించారు.
భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని, అందుకే న్యూఢిల్లీతో తాము చాలా తక్కువగా వ్యాపారం చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. రష్యా, అమెరికా కలిసి ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు: “అత్యధిక సుంకాలే కారణం”
భారత్ విదేశీ దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తున్న విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. ఇదే కారణంగా అమెరికా–భారత్ మధ్య వాణిజ్య పరమైన లావాదేవీలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా 25 శాతం దిగుమతి సుంకాన్ని భారత్ విధించడాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.
చమురు కొనుగోలు వివాదం
రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తుండటమే ఈ వివాదానికి మూలంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా మాత్రం ప్రస్తుతం రష్యాతో వాణిజ్య సంబంధాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది వాస్తవంగా గణనీయమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌పై ట్రంప్ ఘాటుగా స్పందించారు. “వాషింగ్టన్ మా మీద గేమ్ ఆడుతోంది” అనే మెద్వెదేవ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “బహుశా అతనికి ఇంకా తానే అధ్యక్షుడని భ్రమ ఉందేమో” అంటూ సెటైరిక్‌గా విమర్శలు గుప్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Blood Group: బెంగళూరుకు చెందిన ఒక మహిళలో అరుదైన బ్లడ్ గ్రూప్