నోబెల్ శాంతి పురస్కారం(Nobel Peace) దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డు పొందిన వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా తనకు ఫోన్ చేశారన్న ట్రంప్ అది నాకు రావాల్సిన పురస్కారమని ఆమె స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. 2024 నుంచి 8 యుద్ధాలను ఆపానని మరోసారి పునరుద్ఘాటించారు. శాంతి కోసం చాలా చేశామని చెప్పుకునేవారు ఇన్ని యుద్ధాలను ఆపలేదని వ్యాఖ్యానించారు.
వెనుజువెలాలో వారికి సాయం అవసరం
‘ఇప్పటివరకు ఎనిమిది(యుద్ధాలు) ఆపాం. నిన్నటివరకూ ఏడు అని చెప్పా. కానీ అది ఎనిమిదికి చేరింది. మరొకటి ఆపేందుకు ఒప్పందం జరిగింది. నోబెల్ బహుమతి పొందిన మహిళ(మరియా కొరినా-మచాడో) నాకు ఫోన్ చేశారు. మీ గౌరవార్థం ఆ బహుమతిని అంగీకరిస్తున్నానని చెప్పారు. మీరు పూర్తిగా అర్హులని ఆమె స్వయంగా చెప్పారు. ఇది చాలా మంచి విషయం. అయితే దానిని నాకు ఇచ్చేమని నేను చెప్పను. దానికి ఆమె అర్హురాలేనని భావిస్తున్నాను. ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమెకు నేను చాలా సాయం చేస్తున్నాను. వెనుజువెలాలో వారికి సాయం అవసరం కూడా. నాకు 2024కు ఈ అవార్డు ఇవ్వాల్సింది.
France: ఫ్రాన్స్ ప్రధానిగా తిరిగి లెకోర్నుకే పగ్గాలు?
తనకు నోబెల్ శాంతి పురస్కారం రావడంపై మచాదో స్పందిస్తూ ఇది డొనాల్డ్ ట్రంప్‌నకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పురస్కారం రావడాన్ని నమ్మలేకపోతున్నా. ఎన్నో కష్టాలు పడుతున్న వెనెజువెలా ప్రజలకు, తమ పోరాటానికి మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తుది గడువు ముగిసిన తర్వాత నామినేషన్లు
అయితే నోబెల్ శాంతి పురస్కారం నామినేషన్లు ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్‌నకే ఎక్కువగా వచ్చాయి. కానీ, వాటిలో అత్యధికంగా నామినేషన్ల తుది గడువు ముగిసిన తర్వాత వచ్చినవే. నోబెల్ నామినేషన్లు గడువు 2025 ఫిబ్రవరి 1 వరకు ఉంది. కానీ ఆ తర్వాత వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, కంబోడియా ప్రధాని హున్ మనెత్, పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి 1 తర్వాత నామినేషన్లు అందాయి. అయితే పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలను సాధారణీకరించిన 2020 నాటి అబ్రహం ఒప్పందాలకు మధ్యవర్తిత్వం జరిపినందుకుగాను ట్రంప్‌నకు నోబెల్ ఇవ్వాలని నిరుడు డిసెంబరులో కూడా ప్రతిపాదన వచ్చింది. కానీ అది కమిటీ మనసు గెల్చుకోలేకపోయింది. శాంతి పురస్కారానికి ఈ ఏడాది మొత్తం 338 నామినేషన్లు వచ్చాయి.
రాజకీయ వివక్షను ప్రదర్శించింది
మరోవైపు, శాంతి బహుమతి విషయంపై అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం స్పందించింది. ఈ పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారని విమర్శించింది. నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యమిచ్చిందని వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుయెంగ్ అన్నారు. ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత చూపించిన వారిని పక్కనబెట్టి రాజకీయ వివక్షను ప్రదర్శించిందని విమర్శించారు. అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారని తెలిపారు. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడుతారని అన్నారు.
నోబెల్ శాంతి బహుమతి విజేతల సంఖ్య?
నోబెల్ శాంతి బహుమతి దాని 124 సంవత్సరాల చరిత్రలో 142 మంది గ్రహీతలకు 105 సార్లు ప్రదానం చేయబడింది. 2025 నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 10, శుక్రవారం ఉదయం 11:00 గంటలకు నార్వేలోని ఓస్లోలో (09:00 GMT) ప్రకటించనున్నారు.
ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన అనేక మంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖులు: మదర్ థెరిసా (1979), ఆంగ్‌సాన్ సూకీ (1991), షిరీన్ ఎబాదీ (2003), వంగరి మతాయ్ (2004), మరియు మరియా కొరినా మచాడో (2025). 2014లో బాలల హక్కుల కోసం కృషి చేసిన కైలాష్ సత్యార్థి కూడా ఈ బహుమతిని అందుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: