భారత్-పాక్ మధ్య శాంతి లో తన పాత్ర ఉందని ట్రంప్
అమెరికా(Donald Trump) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్–పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొల్పడంలో తానే కీలక పాత్ర వహించానని వ్యాఖ్యానించారు. మయామిలో జరిగిన అమెరికా(America) బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని హెచ్చరించడంతో ఇరు అణుశక్తి దేశాలు వెనక్కి తగ్గాయని తెలిపారు. ఆ సమయంలో భారత్ పాక్ యుద్ధానికి సిద్ధమవుతున్నాయని తెలుసుకున్నాను. ఏడు విమానాలు కూల్చబడగా ఎనిమిదవది తీవ్రంగా దెబ్బతిందని సమాచారం అందింది. ఇది యుద్ధ పరిస్థితే అని గ్రహించాను. వెంటనే ఇరు దేశాలకు శాంతి పాటించకపోతే వాణిజ్య ఒప్పందాలు ఉండవు అని చెప్పాను. మరుసటి రోజే వారు శాంతికి అంగీకరించారని నాకు సమాచారం వచ్చింది, అని ట్రంప్ వివరించారు.
Read also: రెండో రోజూ ఏసీబీ సోదాలు
అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై భారత ప్రతిస్పందన
తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన ఘర్షణలను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. ఇది సుంకాల ప్రభావం వల్లే సాధ్యమైందని, అని ఆయన హాస్యంగా వ్యాఖ్యానించగా సభికులు చప్పట్లు కొట్టారని తెలుస్తోంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిందని గుర్తుచేసింది. పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై మే 7 నుంచి దాడులు ప్రారంభమయ్యాయని, నాలుగు రోజుల పోరాటం తర్వాత పాకిస్థాన్ అధికారులే కాల్పుల విరమణ కోరినట్లు భారత్ తెలిపింది. మే 10న కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని వివరించింది. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు పలు సార్లు చేసినప్పటికీ, భారత్ ప్రతి సారి వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. నివేదికల ప్రకారం, ట్రంప్ ఇప్పటివరకు ఈ అంశాన్ని దాదాపు 60 సార్లు ప్రస్తావించారని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: